NTV Telugu Site icon

India: రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి..?

India

India

India: రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా ఆర్మీలో పని చేస్తున్న సుమారు 25 మంది భారతీయులకు విముక్తి దొరకనుంది. వారందరినీ రిలీజ్ చేయాలని రష్యా సర్కార్ నిర్ణయించింది. రెండు రోజుల రష్యా పర్యటన కోసం రాజధాని మాస్కో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో చర్చించినట్లు సమాచారం. మోదీ గౌరవార్థం పుతిన్ సోమవారం రాత్రి ఇచ్చిన ప్రైవేట్ విందులో ఈ విషయాన్ని ప్రధాని లేవనెత్తారని వెల్లడించారు. దీంతో తమ సైన్యంలో పని చేస్తున్న వారందరినీ వెంటనే విడిచిపెట్టి వారు స్వదేశం చేరుకొనే ఏర్పాట్లు చేయాలని రష్యా నిర్ణయించినట్లు టాక్.

Read Also: Mahesh bday special: మహేష్ ఖలేజా చూపిస్తాడా…మురారితో మెప్పిస్తాడా…?

ఇక, ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయన్ను పుతిన్ ఈ విందు సమావేశంలో ప్రశంసించారు. అలాగే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకోవడం గురించి పుతిన్ ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అయితే, రష్యాలో ఎక్కువ జీతాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్ల మాటలు నమ్మి సుమారు రెండు డజన్ల మంది అమాయకులు ఏడాది కిందట రష్యాకు వెళ్లారు. కాగా, అక్కడకు వెళ్లాక వారిని ఏజెంట్లు మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. దీంతో ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం వారిని సహాయకులుగా జాయిన్ చేసుకుంది. వారికి యూనిఫాంలు, ఆయుధాలు అందించి యుద్ధభూమిలో సైన్యంతో పంపింది.

Read Also: G. Kishan Reddy: నేడు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణం.. పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కాగా, ఇప్పటికే ఈ యుద్ధంలో ఇద్దరు భారతీయులు మరణించారు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు యువకులు తమను కాపాడాలంటూ విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మోడీ సర్కార్ స్పందించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. రష్యా అధికారులకు తెలిపింది. తమ దేశ పౌరులను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని కోరింది. అలాగే, అమాయక యువతను తప్పుదోవ పట్టించిన ఏజెంట్లు, సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. రష్యాకు అక్రమంగా భారతీయులను తరలిస్తున్న ఓ ముఠాను దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి. కనీసం 35 మంది ఇండియన్స్ ను.. బలవంతంగా యుద్ధంలోకి దింపారా లేదా అనే దానిపై విచారణ కొనసాగుతుంది.