Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- బెంగళూరులో నడిరోడ్డుపై గర్భిణీ భర్త ధర్నా
- గవర్నర్ కాన్వాయ్ కోసం 30 నిమిషాలు ట్రాఫిక్ నిలిపివేతపై ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Traffic: వీఐపీ భద్రత పేరుతో సామాన్య ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం, ఇబ్బందులపై కర్ణాటక రాజధాని బెంగళూరులో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. గవర్నర్ కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా పోలీసులు పాత విమానాశ్రయం (ఓల్డ్ ఎయిర్పోర్ట్) రోడ్డుపై సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడంతో భారీ గందరగోళం చెలరేగింది. ఈ ఊపిరాడని ట్రాఫిక్ జామ్‌లో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్తున్న ఓ గర్భిణీ స్త్రీ, ఆమె భర్త చిక్కుకుపోయారు. పోలీసుల తీరుతో సహనం కోల్పోయిన ఆమె భర్త.. నిరసనగా నడిరోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలేం జరిగిందంటే..
పాత విమానాశ్రయ రహదారిలో ప్రస్తుతం అండర్‌పాస్ నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల ఈ రోడ్డు ఇప్పటికే ఇరుకుగా మారి, వాహనదారులు రోజూ నరకం చూస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ కాన్వాయ్ ఆ దారి గుండా వెళ్తుండటంతో సమస్య మరింత జటిలమైంది. మధ్యాహ్నం సుమారు 12:13 గంటల ప్రాంతంలో @Prajvalprince అనే ఖాతా నుంచి ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ అయింది. “ఈరోజు, గవర్నర్ గారి రాకపోకల కారణంగా, సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది” అంటూ సదరు నెటిజన్ ఆ వీడియోను పంచుకున్నారు.
Also Read
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
- Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
‘నా భార్య గర్భవతి.. గవర్నర్ ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నారు!’
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక వ్యక్తి ఇస్రో (ISRO) జంక్షన్ సమీపంలోని జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు మధ్యలోనే కూర్చుని, విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. గవర్నర్ ఇంకా హెచ్ఏఎల్ (HAL) విమానాశ్రయం నుంచి బయలుదేరక ముందే పోలీసులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను నిలిపివేశారని ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్య గర్భవతి అని, నొప్పులతో కారులోనే తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ప్రత్యామ్నాయ మార్గం కూడా లేకపోవడంతో, భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వేరే దారి లేక తను రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని వాపోయాడు. ఆ వ్యక్తి రోడ్డు మధ్యలో ధర్నాకు కూర్చోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఇరకాటంలో పడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతుండటం గమనించిన ట్రాఫిక్ సిబ్బంది.. వెంటనే స్థానిక ‘హోయసల’ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్) పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తికి నచ్చజెప్పి, బలవంతంగా రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఆ తర్వాతే గవర్నర్ కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు కదిలింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెటిజన్లు, సామాన్య ప్రజలు వీఐపీ కల్చర్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. “ప్రముఖుల భద్రత పేరుతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను, గర్భిణీ ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమర్థనీయం?” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అత్యవసర వాహనాలకు, అంబులెన్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వకుండా వీఐపీ కాన్వాయ్‌ల కోసం గంటల తరబడి రోడ్లు బంద్ చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Old Airport Road is already choking under underpass construction. Today, traffic was completely halted for nearly 30 minutes due to the Governor’s movement. A man carrying his pregnant wife was stuck in the gridlock. When will public convenience matter as much as VIP convenience? pic.twitter.com/jVCFRGFSEP
— Prajval Prince (@prajvalprince) May 31, 2026
తాజావార్తలు
-
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
-
Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
-
Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
-
Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్‌పై సజ్జల తీవ్ర విమర్శలు..
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!