బూటుకాలితో తన్నుతూ.. దివ్యాంగురాలిపై ఖాకీ క్రౌర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివ్యాంగులంటే కాసింత దయ, కరుణ వుండాలి. కానీ బెంగళూరులో ఓ ఖాకీ దివ్యాంగురాలైన ఓ మహిళ పట్ల కాఠిన్యం ప్రదర్శించారు. బెంగళూరు పోలీసు మాత్రం కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించారు. బెంగళూరు సిటీలో ఓ మహిళ దివ్యాంగురాలు. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను ట్రాఫిక్ టోయింగ్ వాహనంపై తరలిస్తుండగా వాటిని అడ్డుకుందో మహిళ. అంతేకాదు ఆ వాహనాలను తీసుకెళుతున్న టోయింగ్ వెహికల్ పై రాళ్ళు వేసింది. ఆమె వేసిన ఓ రాయి అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ నారాయణ కంటికి కొంచెం తగిలింది. దీంతో సహనం కోల్పోయిన ఎఎస్ఐ తన ప్రతాపం చూపించాడు.
దివ్యాంగురాలు అని కూడా చూడకుండా బూటుకాలితో తన్నుతూ ఆమెపై తన ప్రతాపం చూపించాడు. ఇష్టం వచ్చినట్టు తన్నుతూ ఆమెను హింసించాడు. ఈ తతంగాన్ని ఓ జర్నలిస్ట్ వీడియో తీశాడు. పోలీసుల తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాదు రివర్స్ కేసు ఫైల్ చేశాడా పోలీస్. ఆమెపై సెక్షన్ 332, 353 కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. విధి నిర్వహణలో వున్న తనను తన విధులు నిర్వహించకుండా అడ్డుకుందని, ఉద్దేశపూర్వకంగా గాయపరిచిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు నెటిజన్లు.
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు. గతంలో యూపీలోనూ జరిగాయి. టూ వీలర్ పై వెళుతున్న ఓవ్యక్తి చెంపపై చెళ్ళుమనిపించాడో పోలీస్ అధికారి. తన పిల్లాడితో కలిసి వెళుతున్న వ్యక్తిపై విచక్షణరహితంగా దాడిచేశాడు. తనను కొట్టవద్దని ప్రాధేయపడినా ఆ పోలీసు పట్టించుకోలేదు. పిల్లాడిని కూడా వదలలేదు. ఈ ఘటన సంచలనం కలిగించింది. ఈ వీడియో చూసిన ఉన్నతాధికారులు ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు.
కేరళలోనూ ఇలాంటి సంఘటన జరిగింది. రైలులో స్లీపర్ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని చితకబాదాడు ఓ కానిస్టేబుల్. తనను కొట్టవద్దని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. అతనిపై తన ప్రతాపం చూపించాడు. ఆ పాసింజర్ చేసిన తప్పేంటంటే జనరల్ టికెట్ కొని, స్లీపర్ కోచ్ లో ప్రయాణించడమే జనవరి2, 2022న జరిగిన ఈ ఘటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!