కర్ణాటక రాజధాని బెంగళూరులో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలో స్కూల్ బస్సు ఒరిగిపోయింది. బస్సులో సుమారు 20 మంది ఉన్నట్లు సమాచారం. పిల్లలను అందరిని సురక్షితంగా బయటకు తీసారు. పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. రెండు స్కూల్ బస్సులు పాణత్తూరు-బలగెరె మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ఒక బస్సు ముందుగా వెళ్లగా, మరొక బస్సు దాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే సుమారు 20 మంది విద్యార్థులు ఉన్న ఆ స్కూల్ బస్సు, పక్కన ఉన్న బురద మయమైన గుంతలో కూరుకుపోయింది. బస్సు సగానికిపైగా ఒక వైపుకు వంగి నిల్చుకుంది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు పిల్లలను రక్షించారు
ఈ ప్రమాదం కారణంగా ఆ బస్సులో ఉన్న పిల్లలలో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి. సంఘటన గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, అక్కడికి చేరుకుని బస్సు విండోలను తెరిచి ఎమర్జెన్సీ డోర్లు ద్వారా పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకున్నారు. ఈ సంఘటన స్కూల్ బస్సు వెనుక ఉన్న కారు డ్యాష్‌బోర్డు కెమెరా ద్వారా వీడియోగా రికార్డు అయింది. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయి ప్రజలలో తీవ్ర చర్చకు దారి తీసింది.పోలీసులు ప్రస్తుతానికి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, పరిస్థితి మరింత ప్రమాదకరమవ్వకుండా పరిశీలనలు చేస్తున్నారు.
Bengaluru’s roads are no longer just an inconvenience they are a full-blown danger to life. The crater-filled, slushy Panathur–Balagere stretch is a perfect example of the government’s negligence. This morning, a school bus carrying around 20 children nearly toppled over. The… pic.twitter.com/FfsnzMFf3r
— Karnataka Portfolio (@karnatakaportf) September 12, 2025