Bengaluru: ఆకతాయిల అకృత్యం.. ప్రాణాలు తీసిన బాణాసంచా పందెం
- బెంగళూరులో ఆకతాయిల అకృత్యం
- ప్రాణాలు తీసిన బాణాసంచా పందెం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్నేహితులతో సరాదాగా కాసిన పందెం ప్రాణాల మీదకు తెచ్చింది. దీపావళి రాత్రి (అక్టోబర్ 31) బెట్టింగ్ ఛాలెంజ్‌లో భాగంగా శక్తివంతమైన బాణాసంచాపై కూర్చున్నాడు. ఒక్కసారి పేలడంతో ప్రాణాలు పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Delhi: మహిళా రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి కోర్టు సమన్లు..
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
మద్యం మత్తులో ఉన్న శబరీష్(32)ను బాణాసంచా ఉన్న డబ్బాపై కూర్చుంటే ఆక్షా కొనిస్తామని స్నేహితులు ఆశచూపారు. దీంతో ఛాలెంజ్‌కు సై అన్నాడు. ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్న శబరీష్ కొత్త ఆటో వస్తుందన్న ఆశతో సవాల్ స్వీకరించాడు. పందెం ప్రకారం శబరీష్ ఆ డబ్బాపై కూర్చున్నాడు. ఆ తర్వాత ఆకతాయిలు అందరూ దూరంగా వెళ్లిపోయారు. శబరీష్ కూర్చున్న డబ్బా కింద ఉన్న బాంబులు భారీ శబ్ధంతో పేలాయి. అధిక మొత్తంలో బాంబులు పేలడంతో శబరీష్ అక్కడే కిందపడిపోయాడు. పేలుడు ధాటికి అతడు గాయపడ్డాడు. ఈ ఘటనలో శబరీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడు ధాటికి అతని అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నివేదికలు తెలిపాయి. అదే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ బెంగళూరు) లోకేష్ జగలాసర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Tragedy: పిడుగుపాటుకు మైదానంలో ఆటగాడు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు(వీడియో)
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!