NTV Telugu Site icon

Bengaluru: ఆకతాయిల అకృత్యం.. ప్రాణాలు తీసిన బాణాసంచా పందెం

Bengaluru

Bengaluru

స్నేహితులతో సరాదాగా కాసిన పందెం ప్రాణాల మీదకు తెచ్చింది. దీపావళి రాత్రి (అక్టోబర్ 31) బెట్టింగ్ ఛాలెంజ్‌లో భాగంగా శక్తివంతమైన బాణాసంచాపై కూర్చున్నాడు. ఒక్కసారి పేలడంతో ప్రాణాలు పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Delhi: మహిళా రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి కోర్టు సమన్లు.. ​​

మద్యం మత్తులో ఉన్న శబరీష్‌(32)ను బాణాసంచా ఉన్న డబ్బాపై కూర్చుంటే ఆక్షా కొనిస్తామని స్నేహితులు ఆశచూపారు. దీంతో ఛాలెంజ్‌కు సై అన్నాడు. ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్న శబరీష్‌ కొత్త ఆటో వస్తుందన్న ఆశతో సవాల్ స్వీకరించాడు. పందెం ప్రకారం శబరీష్ ఆ డబ్బాపై కూర్చున్నాడు. ఆ తర్వాత ఆకతాయిలు అందరూ దూరంగా వెళ్లిపోయారు. శబరీష్ కూర్చున్న డబ్బా కింద ఉన్న బాంబులు భారీ శబ్ధంతో పేలాయి. అధిక మొత్తంలో బాంబులు పేలడంతో శబరీష్ అక్కడే కిందపడిపోయాడు. పేలుడు ధాటికి అతడు గాయపడ్డాడు. ఈ ఘటనలో శబరీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడు ధాటికి అతని అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నివేదికలు తెలిపాయి. అదే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ బెంగళూరు) లోకేష్ జగలాసర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Tragedy: పిడుగుపాటుకు మైదానంలో ఆటగాడు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు(వీడియో)

 

Show comments