Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్‌పై ప్రముఖ సంస్థ మౌనం..
- పశ్చిమ బెంగాల్‌లో అంతుచిక్కని ఓటర్ నాడి..
- ఎగ్జిట్ పోల్స్‌పై యాక్సిస్ మై ఇండియా మౌనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Exit Poll: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఎన్నికలు ముగిశాయి. అయితే, దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి చూపిస్తున్నారు. మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ ప్రభుత్వం ఏర్పడుతుందా? లేక బీజేపీ అధికారంలోకి వస్తుందా? అని ఆలోచిస్తున్నారు. బుధవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారం చేపట్టవచ్చని అంచనా వేశాయి. ఒకటి రెండు ఎగ్జిట్ పోల్ సంస్థలు మళ్లీ టీఎంసీ అధికారం చేపడుతుందని చెప్పాయి.
Read Also: Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
ఇదిలా ఉంటే, ప్రముఖ సంస్థ ‘‘యాక్సిస్ మై ఇండియా’’ మాత్రం బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అంచనాలను ఇవ్వలేదు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ సర్వేకు ఓటర్లు స్పందించలేదని చెప్పారు. ఓటర్ల నాడిని పసిగట్టలేకపోయామని, ఓటర్లు తాము ఎవరికి ఓటేశామనే విషయాన్ని బయటకు చెప్పడం లేదని అన్నారు. తాము ప్రజల్ని ప్రశ్నించినప్పుడు 60-70 శాతం మంది ప్రజలు మౌనం వహించారని అన్నారు. అయితే, బెంగాల్ ఎన్నికల గురించి మళ్లీ గురువారం ఓటర్లను ప్రశ్నించే ప్రయత్నం చేస్తామని, ఎన్నికలు ముగియడం వల్ల ప్రజలు ప్రశాంతంగా ఉంటారని ఆయన అన్నారు.
294 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ రెండు దశల్లో కూడా ప్రజలు భారీ సంఖ్యలో బయటకు వచ్చి ఓటేశారు. రెండు దశల్లో ఓటింగ్ శాతం 90ని మించింది. అయితే, గత చరిత్రను చూస్తే బెంగాల్ ఎన్నికల్లో భారీగా హింస చోటు చేసుకుంది. హత్యా రాజకీయాలు నడిచాయి. ఇది కూడా ప్రజలు తాము ఎవరికి ఓటేశామనే విషయాన్ని చెప్పకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. తమ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రజలు వెనుకాడుతున్నారు.

తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..