Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..
- బెంగాల్ ఎన్నికల్లో సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..
- బీజేేపీతో డీల్, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు..
- పొత్తును రద్దు చేసుకున్న ఎంఐఎం..
- ఇదంతా టీఎంసీ కుట్ర అని కబీర్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Elections: బెంగాల్ రాజకీయాల్లో హుమాయున్ కబీర్ వీడియో సంచలనంగా మారింది. బెంగాల్‌లోని ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, బీజేపీతో తనకు డీల్ ఉందని చెబుతున్నట్లుగా వీడియో చూపిస్తుంది. కబీర్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియోలను విడుదల చేసింది. అయితే, ఈ వీడియో ఏఐతో క్రియేట్ చేసిందని, ముస్లిం ఓటర్లను తన నుంచి దూరం చేసేందుకు టీఎంసీ ఎత్తుగడ అని కబీర్ ఆరోపించారు. టీఎంసీపై పరువునష్టం కేసు పెడతానని హెచ్చరించారు.
అయితే, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐంఎం పార్టీ కబీర్ పార్టీతో పొత్తుకు నిరాకరించింది. అంతకుముందు, ఈ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తనను ఓడించడమే పీఎంఓ ఏకైక లక్ష్యమని అన్నారు. బీజేపీతో డీల్ ఉందని చెబుతున్నట్లు చూపిస్తున్న వీడియోపై అమిత్ షాను ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు నిర్మించే వారితో కలవడం కన్నా 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పారు.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
Read Also: Telangana Intermediate Second Year Results 2026
ఈ వీడియోలో హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. ముస్లింలను మోసం చేయడం సులభమని, బాబ్రీ అంశాన్ని ప్రస్తావించడం, రూ. 200 కోట్ల ముందస్తు నిధుల్ని డిమాండ్ చేయడం వంటి కామెంట్స్ చేశారు. టీఎంసీని దెబ్బతీసే విధంగా మైనారిటీ ఓట్లను తన వైపు తిప్పుకునేలా, దీని ద్వారా బీజేపీకి ప్రయోజనం చేకూరేలా తన వ్యూహాన్ని కబీర్ వివరిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఆయన రూ. 1000 కోట్ల గురించి ప్రస్తావించడం ఇందులో ఉంది. దీంట్లో రూ. 200 కోట్ల అడ్వాన్స్ పొందినట్లు ఆయన చెబుతున్నట్లు వీడియో చూపించింది. కబీర్ ప్రధాని మోడీ, అమిత్ షా, మఖ్యమంత్రులు మోహన్ యాదవ్, హిమంత బిశ్వ శర్మ పేర్లను ప్రస్తావిస్తున్నట్లు ఉంది.
అయితే, ఈ ఆరోపణల్ని కబీర్ ఖండించారు. నవంబర్ 2019 నుంచి తనకు ఏ బీజేపీ నేతతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పార్టీ నాయకులు కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీమ్‌లు ఒక ‘బూటకపు’ స్టింగ్ ఆపరేషన్‌ను నడిపించారని ఆయన ఆరోపించారు. వారు తన ప్రతిష్ట దెబ్బ తీయడానికి ఏఐని వాడుకున్నారని చెప్పారు. ఈ ఆరోపణలతో తప్పుదోవ పట్టొద్దని ముస్లింలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ముస్లిం ఓట్లు కోల్పోతామనే భయంతో తనను అప్రతిష్టపాలు చేయాలని టీఎంసీ పన్నిన కుట్ర ఇదని, ఈ నకిలీ వీడియో ముస్లింల మనోభావాలను కూడా అవమానించిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!