Dead Declared Daughter: బీహార్‌లో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తమ కూతురు కనిపించడం లేదని ఒక తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అమ్మాయి కోసం వెదుకుతున్నారు. నెల రోజులుగా ఆచూకీ దొరకలేదు. అయితే నెల రోజుల తరువాత ఆ అమ్మాయి తండ్రికి పోలీసులు ఒక మృతదేహం చూపించారు. అమ్మాయి నీటిలోపడి చనిపోయింది. అమ్మాయి వేసుకున్న బట్టల ఆధారంగా చనిపోయింది తమ కూమార్తేనని తండ్రి గుర్తించాడు. దీంతో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చేసేది లేక అమ్మాయికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. అంతా సిద్ధం చేసుకొని తలకొరివి పెట్టే సమయంలో తండ్రికి చనిపోయిందనుకున్న కూతురు నుంచి వీడియో కాల్ వచ్చింది. షాక్ తిన్న తండ్రి ఫోన్ మాట్లాడాడు.. తాను చనిపోలేదని.. బ్రతికే ఉన్నానని ఫలాన దగ్గర ఉన్నట్టు చెప్పింది. దీంతో తల్లీదండ్రులు సంతోషించారు. అయితే ఆ అమ్మాయి తన లవర్‌తో పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తల్లిదండ్రులకు తెలిపింది.
Read also: Shanti Priya: స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్.. సెట్స్‌లో అందరి ముందే ఆ పాడుపని
బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని అక్బర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన అంశు కుమారి నెలరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎన్నోచోట్లా గాలించారు… అయినా ఫలితం లేదు. రెండు రోజుల క్రితం పోలీసులు ఒక యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అంశు కుటుంబ సభ్యులు ఆ మృతదేహానికి ఉన్న దుస్తులు చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. ఆ మృతదేహం నీటిలో దొరికిన కారణంగా ముఖం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. దాంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది. అంశు తండ్రి ఆ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఇంతలో ఆ తండ్రి మొబైల్‌కు ఒక వీడియో కాల్ వచ్చింది. దానిలో ‘నాన్నా.. నేను బతికే ఉన్నాను’ అంటూ అతని కుమార్తె మాట్లాడింది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడున్నవారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరిగి అతని కుమార్తె ఫోనులో.. తాను తన ప్రియుడిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో.. ఇంటి నుంచి పారిపోయానని తెలిపింది. ప్రస్తుతం అత్తవారింట్లో ఉన్నానని పేర్కొంది. అయితే పోలీసులకు లభ్యమైన ఆ యువతి మృతదేహం ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసులు గుర్తుతెలియన మృతదేహంగా కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు మొదలు పెట్టారు.