Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
- బీజేపీ కంచుకోటలో సంచలనం
- భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
- అన్ని రౌండ్లలో ఆధిక్యం సాధించిన రాజకీయ వ్యూహకర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీకి అత్యంత బలమైన కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గంలో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్.. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 18వ రౌండ్ ముగిసే సమయానికి ఆయన ఆధిక్యం 10,436 ఓట్లకు చేరింది.
బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 31 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ప్రారంభ రౌండ్ల నుంచే ప్రశాంత్ కిషోర్ ముందంజలో నిలిచారు. 18వ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై ఆయన 10,436 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అంతకుముందు 15 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ప్రశాంత్ కిషోర్‌కు 29,752 ఓట్లు లభించగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 8,202 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 11వ రౌండ్ ముగిసే సమయానికి ప్రశాంత్ కిషోర్‌కు 28,201 ఓట్లు రాగా.. నీరజ్ కుమార్‌కు 20,420 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం 7,781 ఓట్లకు చేరింది. అయితే వివిధ రౌండ్లకు సంబంధించి వెలువడిన ఓట్ల సంఖ్యల్లో మార్పులు ఉండటంతో ఎన్నికల సంఘం విడుదల చేసే తాజా అధికారిక గణాంకాలనే తుది వివరాలుగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రారంభ రౌండ్లలో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం క్రమంగా పెరుగుతూ వచ్చింది.
Also Read
- Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
- Brij Bhushan Sharan Singh: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
- Solar Eclipse: అజ్ఞానం రాసిన కథను.. విజ్ఞానం తిరగరాసింది.. సూర్యగ్రహణం వెనుక దాగిన నిజం!
- Tamil Nadu Farmers Protest: కావేరీ నీటి కోసం.. నదీ తీరంలో ఇసుకలో కూరుకుపోయి రైతుల వినూత్న నిరసన
నాలుగో రౌండ్ ముగిసే సమయానికి ప్రశాంత్ కిషోర్‌కు 6,269 ఓట్లు లభించగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 1,145 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. ఐదో రౌండ్ తర్వాత ఆయన ఆధిక్యం 2,319 ఓట్లకు పెరిగింది. ఆరో రౌండ్ ముగిసే సమయానికి ప్రశాంత్ కిషోర్‌కు 11,603 ఓట్లు రాగా.. నీరజ్ కుమార్‌కు 8,152 ఓట్లు వచ్చాయి. దీంతో జన్ సురాజ్ పార్టీ అధినేత 3,451 ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేశారు. ప్రారంభంలో ఎన్నికల సంఘం వెబ్సైట్లో వెలువడిన ట్రెండ్స్ ప్రకారం.. ప్రశాంత్ కిషోర్‌కు 2,225 ఓట్లు లభించగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌కు 1,363 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ 862 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 505 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగారు. మూడో రౌండ్ ముగిసే సమయానికి అధికారిక గణాంకాల ప్రకారం ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారికి 767 ఓట్లు వచ్చాయి. ఆమె అగ్రస్థానంలో ఉన్న అభ్యర్థి కంటే 3,131 ఓట్ల వెనుకబడి మూడో స్థానంలో కొనసాగారు. బీజేపీ, జన్ సురాజ్ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా.. ఆర్జేడీ అభ్యర్థి వెనుకబడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బంకీపూర్ ఉప ఎన్నికలో మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ.. జన్ సురాజ్ పార్టీ, బీజేపీ, ఆర్జేడీ మధ్య ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఏప్రిల్‌లో తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు.
బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేయగా.. ఆర్జేడీ మరోసారి రేఖా కుమారిని బరిలోకి దింపింది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు ఈ ఎన్నిక అత్యంత కీలక పరీక్షగా మారింది. బీహార్‌లో జన్ సురాజ్ పార్టీ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఫలితం కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జూలై 30న జరిగిన బంకీపూర్ ఉప ఎన్నికలో 34.30 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 41.45 శాతం ఓటింగ్‌తో పోలిస్తే గణనీయంగా తక్కువ. తక్కువ పోలింగ్ మధ్య ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై ఎన్నికలకు ముందు ఆసక్తి నెలకొంది.
బంకీపూర్ నియోజకవర్గం 1995 నుంచి నిరంతరం బీజేపీ ఆధీనంలో ఉంది. అప్పట్లో ఈ నియోజకవర్గాన్ని పాట్నా వెస్ట్గా పిలిచేవారు. నితిన్ నబిన్ వరుసగా ఐదుసార్లు ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 50 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాంటి బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ స్పందిస్తూ.. ప్రశాంత్ కిషోర్ ఓటమి ఖాయమని, భారీ తేడాతో ఓడిపోతారని వ్యాఖ్యానించారు. బంకీపూర్‌లో అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. నితీశ్ కుమార్ 20 ఏళ్ల పాలనలో బంకీపూర్ నియోజకవర్గం పూర్తిగా మారిపోయిందని, ఆ అభివృద్ధి ప్రయాణాన్ని ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కొనసాగించారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితంలో ఎలాంటి మార్పు ఉండదని ధీమా వ్యక్తం చేశారు.
బంకీపూర్ ఉప ఎన్నిక కేవలం ప్రశాంత్ కిషోర్ తొలి ఎన్నికల పోటీగా మాత్రమే కాకుండా.. బీహార్ ప్రతిపక్ష రాజకీయాలకు కీలక పరీక్షగా మారింది. బీజేపీ తన అత్యంత సురక్షిత స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆర్జేడీ దశాబ్దాలుగా ఆధారపడుతున్న ముస్లిం-యాదవ్ (ఎం-వై) సామాజిక సమీకరణలో మార్పు వస్తుందా అనే అంశం కూడా చర్చకు వచ్చింది.
ముస్లిం-యాదవ్ వర్గాల మద్దతు చాలా కాలంగా ఆర్జేడీ రాజకీయాలకు ప్రధాన బలంగా ఉంది. అయితే బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయాలనే ఉద్దేశంతో ముస్లిం ఓటర్లలో కొందరు జన్ సురాజ్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనే అంశాన్ని ఈ ఉప ఎన్నిక పరీక్షిస్తోంది. జన్ సురాజ్ ఆర్జేడీ సంప్రదాయ ఓటు బ్యాంకులో కొంత మద్దతు పొందగలిగితే.. 2030 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బంకీపూర్ ఉప ఎన్నికకు బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థిని మార్చడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కుటుంబ కారణాలతో అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నప్పటికీ.. అంతర్గత విభేదాలు, రాజకీయ సమీకరణాలు కూడా ఈ నిర్ణయానికి కారణమై ఉండవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ తొలుత అభిషేక్ కుమార్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. అదే రోజు బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అనంతరం బీజేపీ 32 ఏళ్ల నీరజ్ కుమార్ సిన్హాను జూలై 30 ఉప ఎన్నికకు అభ్యర్థిగా ప్రకటించింది.
బీజేపీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. నీరజ్ కుమార్ సిన్హా 2006 నుంచి పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన బూత్ అధ్యక్షుడిగా, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అభిషేక్ కుమార్ సిన్హా, నీరజ్ కుమార్ సిన్హా ఇద్దరికీ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా గుర్తింపు లేదని తెలుస్తోంది. ఈ ఇద్దరు అభ్యర్థుల ఎంపికలో బంకీపూర్‌కు వరుసగా ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన నితిన్ నబిన్ కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. నియోజకవర్గంపై మంచి అవగాహన ఉన్న నితిన్ నబిన్ సూచనల మేరకే వీరిని ఎంపిక చేసినట్లు స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
బంకీపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తుది ఫలితంలో ప్రశాంత్ కిషోర్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుని బీజేపీ కంచుకోటను చేజిక్కించుకుంటారా? లేక చివరి రౌండ్లలో బీజేపీ పుంజుకుంటుందా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
VIDEO | Bihar: Tight security arrangements in place ahead of counting of votes for the Bankipur Assembly by-poll. Visuals from A.N. College counting centre, Patna.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/H39bS6OYdf
— Press Trust of India (@PTI_News) August 3, 2026
తాజావార్తలు
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
-
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
-
Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!