జులై నెలలో బ్యాంకు లావాదేవీలు చేసే వారికి ఓ బాడ్ న్యూస్. జులై నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ అధికారికంగా ప్రకటన చేసింది. జూలై నెలలో నాలుగు ఆదివారాలు మరియులు రెండో, నాలుగో శనివారాలు బ్యాంకు సిబ్బందికి సాధారణంగా సెలవులు ఉంటాయి. కానీ..జూలై నెలలో పండుగలు, ప్రత్యేకమైన రోజుల కారణంగా మరో తొమ్మిది రోజుల పాటు బ్యాంకులకు హాలీ డేస్ వచ్చాయి. అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ నిర్ణయాలను బట్టి మార్పు ఉండవచ్చు. ఇక బ్యాంకు వినియోగదారులకు ఈ తేదీల్లో మినహా మిగిలిన రోజుల్లో సేవలు వినియోగించుకోగలరని రిజర్వ్ బ్యాంక్ కోరింది.
బ్యాంకుల సెలవుల వివరాలు :
జూలై 4 -ఆదివారం
జులై 10 -రెండో శనివారం
జూలై 11 -ఆదివారం
జులై 18 -ఆదివారం
జూలై 24 -4వ శనివారం
జూలై 25 -ఆదివారం
జూలై 12 -కాంగ్ రథయాత్ర
జూలై 13 -భాను జయంతి
జులై 14 -దృక్ప శేచి
జులై 16-హరేల
జులై 17 – యు టిరోట్ సింగ్ డే/ కర్చీ పూజ
జులై 19 – గురు రింపోచి తుంగ్ కార్ శేచి
జులై 20 – బక్రీద్
జులై 21 – బక్రి ఈద్ (ఈద్ ఉల్ జుహా) (ఈద్ ఉల్ అదా)
జులై 31 – కేర్ పూజ