Bangladeshi Hindus: భారత్‌లోకి వచ్చేందుకు బంగ్లాదేశ్ హిందువుల ప్రయత్నం.. నీటిలో నిలబడి నిరసన..!
- బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కొనసాగుతున్న హింస..
- భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న బంగ్లాదేశ్ హిందూ కుటుంబాలు..
- తమను భారత్ లోకి అనుమతించాలని నీటిలో నిలబడి బంగ్లాదేశ్ హిందువుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladeshi Hindus: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలైన హిందువులను టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ (భారత సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ ప్రజలు) నుంచి చాలా హిందూ కుటుంబాలు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి రావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. భారత్ -బంగ్లా సరిహద్దులోకి వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. సరిహద్దు భద్రత విషయంలో బీఎస్ఎఫ్ కూడా అప్రమత్తమైంది. దాదాపు 1000 మంది బంగ్లాదేశీయులు బెంగాల్‌లోని సితాల్‌కుచి, కూచ్ బెహార్‌లోని రిజర్వాయర్‌లో నిలబడి.. తమను భారతదేశంలోకి అనుమతించమని బీఎస్ఎఫ్ సిబ్బందిని అభ్యర్థిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ఇదే అతి పెద్ద గ్రూపు అని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
Read Also: Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
కాగా, కూచ్ బెహార్‌లోని కాషియార్ బరుని ప్రాంతంలోని పతంతులి గ్రామం దగ్గర సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన ప్రజలు కంచె దాటి రిజర్వాయర్‌లో గంటల తరబడి నిరీక్షించారు. అందులో కొందరు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు కూడా చేశారు. సరిహద్దులోని జీరో పాయింట్ నుంచి 150 గజాల దూరంలో ఉన్న కంచెను దాటకుండా బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లాలోని దోయ్ ఖావా, గెందుగురి గ్రామాలలోని ప్రజలను తిరిగి తమ ఇళ్లకు వెళ్లమని బీఎస్ఎఫ్ సైనికులు విజ్ఞప్తులు చేసినప్పటికీ.. వారు మాత్రం అక్కడే నిలబడి ఆందోళన చేస్తున్నారు.
Read Also: Israel–Hamas war: గాజాలో నిరాశ్రయులు బస చేస్తున్న స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి
అయితే, గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌కు చెందిన ప్రజలు బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల్లోని పెట్రాపోల్‌కు చేరుకుంటున్నారు. సరిహద్దుపై నిఘా ఉంచేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళం తూర్పు కమాండ్ ఏడీజీని కమిటీకి చైర్మన్‌గా ఎంపిక చేసింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేశాయి.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!