NTV Telugu Site icon

Bangladesh: భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం..

Yonus

Yonus

Bangladesh: భారతదేశంతో తమ దేశం సత్సంబంధాలను కోరుకుంటుందని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ తెలిపారు. ఇటీవల ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఇతర వర్గాలతో యూనస్‌ సమావేశం అయ్యారు. ఈ ఇష్యూపై అడిగిన ప్రశ్నకు ఆయన సహాయకుడు మహఫుజ్‌ ఆలం రియాక్ట్ అవుతూ.. ‘‘మేం భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నాం.. ఇవి కచ్చితంగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని మహ్మద్ యూనస్‌ చెప్పారని అతడు వెల్లడించారు. పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో బంగ్లాదేశ్‌ పరస్పర గౌరవం ఇస్తుందన్నారు. సార్క్‌( సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ రీజనల్‌ కోపరేషన్‌)ను పునరుద్ధరించాలని యూనస్‌ నొక్కి చెప్పినట్లు మహపుజ్ ఆలం చెప్పారు.

Read Also: Srisailam Temple: శ్రీశైలం ఆలయంలో భక్తులకు విభూదిధారణ పునఃప్రారంభం

ఇక, భారత్‌లో ఉన్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ విమర్శలు చేస్తున్నారని మహమ్మద్ యూనస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు హసీనా భారత్‌లో మౌనంగా ఉండాలని అన్నారు. లేకపోతే ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే, మరోవైపు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల లఖ్‌నవూలో జరిగిన కమాండర్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. గాజా, ఉక్రెయిన్‌లో పరిస్థితితో పాటు భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా భారత ఆర్మీ సిద్ధంగా ఉండాలన్నారు. అనుకోని ఘటనలు జరిగితే.. వెంటనే ఎదుర్కొవాలన్నారు. రాజ్ నాథ్ సింగ్ పరోక్షంగా బంగ్లాదేశ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగశాఖ సలహాదారు ఎండీ తౌహిద్‌ హుస్సేనీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజ్ నాథ్ వ్యాఖ్యలను చూసి నేను ఆందోళన చెందడం కంటే.. ఆశ్చర్యపోయా.. ఆయన అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారో నాకు తెలియదన్నారు. వాటి వెనక నాకు బలమైన కారణం ఏం కనిపించలేదని తౌహిద్ హుస్సేనీ అన్నారు.