Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్‌లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) చీఫ్, మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహమ్మాన్ సౌదీ అరేబియాలోని పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ అధికారులతో సమావేశమైనట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు బంగ్లాదేశ్ అధికారులు పేర్కొన్నారు.
హింసకు ముందు ఎక్స్ వేదికగా అనేక ‘‘ బంగ్లాదేశ్ వ్యతిరేక’’ హ్యాండిల్స్ నిరంతరం నిరసనలకు ఆజ్యం పోశాయి. పాకిస్తాన్ హ్యాండిల్స్ నుంచి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 500 పైగా వ్యతిరేక ట్వీట్లు చేయబడ్డాయి. హసీనా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పాకిస్తాన్ అనుకూలమైన బీఎన్‌పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెలిపాయి. ఐఎస్ఐ ద్వారా చైనా కూడా నిరసనల్ని పెంచేందుకు సహకరించి, షేక్ హసీనా భారత్ పారిపోయేలా చేసింది.
Read Also: Indian Hockey Team: 44 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించబోతుందా..?
చైనా, ఐఎస్ఐ ఎలా కుట్ర పన్నాయి..?
ప్రభుత్వం ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ విమోచన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై అక్కడి విద్యార్థులు ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఇవి హింసాత్మక ఘటనలుగా మారడంతో 300 మంది మరణించారు. జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన ఇస్లామీ ఛత్రత శిబిర్(ఐసీఎస్)కి పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉంది. హసీనా స్థానంలో పాక్-చైనా అనుకూల పాలన తీసుకువచ్చేందుకు కుట్ర పన్నినట్లు నిఘా సంస్థలు తెలిపాయి. భారత వ్యతిరేక వైఖరితో ‘ఇండియా అవుట్’ అనే నిరసనను జమాతే ఇస్లామీ సంస్థ ప్లా్న్ చేసింది.
మొత్తం నిరసనలకు, హింసకు పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనా సంస్థల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ నిరసనల సమయంలో సోషల్ మీడియా కార్యకలాపాలను స్కాన్ చేస్తున్నప్పుడు, అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు, నిరసనకారులపై హింసాత్మక వీడియోలు మరియు షేక్ హసీనాను రాక్షసంగా చిత్రీకరించే పోస్టర్‌లు BNP మరియు దాని అనుబంధ ఖాతాలచే తయారు చేయబడుతున్నట్లు గమనించబడింది. వీటిలో చాలా వరకు యూఎస్-ఆధారిత అకౌంట్ల ద్వారా విస్తరించబడింది.