సాధారణంగా మనం సినిమా థియేటర్ కు ఎందుకు వెళతాం.. సినిమా చూడడానికే కదా.. కానీ కొందరు థియేటర్లో చేసే పనులు చూస్తుంటే.. ఏం టార్చర్ రా నాయనా అనిపిస్తుంది కదా… ఇది ఓన్లీ సినియా డైలాగే. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ లో జరిగిన ఈ సీన్ చూస్తే.. ఈ డైలాగే రీపీట్ అయ్యేలా ఉంది.
బెంగళూరులోని ఒక సినిమా థియేటర్లో యువతి ల్యాప్ టాప్లో వర్క్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు, కొన్ని ఐటీ సంస్థలు ఉద్యోగులను బానిసలుగా భావిస్తున్నాయని, ఇలా ఎక్కడకు వెళ్లినా టార్చర్ చేస్తూ పని ఒత్తిడిని పెంచుతున్నాయని నెటిజన్లు ఆ ఫొటోపై స్పందిస్తున్నారు. అందరు సినిమా థియేటర్కు రిలాక్స్ కోసం వస్తే.. కొందరు మాత్రం .. ‘వర్క్ ఫ్రం థియేటర్’ కు వచ్చినట్లు అనిపిస్తోంది.
బెంగళూరు సిటీలో ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని.. ‘లోక’ సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లిన తనకు ఇలా ల్యాప్ టాప్లో వర్క్ చేస్తూ ఒక యువతి కనిపించిందని రెడిట్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేశాడు. బెంగళూరులో కార్పొరేట్ సంస్థల తీరు మారాలని, ఉద్యోగుల వ్యక్తిగత స్వే్చ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.