NTV Telugu Site icon

Bandi Sanjay: తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురండి.. బండి సంజయ్ తో ప్రధాని మోడీ

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ తో ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ విధివిధానాలపై చర్చించారు.

Read also: Harish Rao: దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదు..!

పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం శుక్రవారం ఉదయం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నేతలతో కొద్దిసేపు సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంటారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు పలువురు రాష్ట్ర నేతలు, సీనియర్లు కూడా హాజరుకానున్నారు. అక్కడ ప్రసంగం అనంతరం నేరుగా కరీంనగర్ వెళతారని పార్టీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి.
Pan India Stars: పూనకాలే… ఒకేసారి నలుగురు పాన్ ఇండియా మొనగాళ్లు!

Show comments