India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌కి భారత్ వరస షాక్‌లు ఇస్తోంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నది, దాని ఉపనదులకు సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ని భారత్ రద్దు చేసుకుంది. ఇక పాకిస్తాన్ సెలబ్రిటీలపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. భారత్‌లో ప్రజాదరణ ఉన్న పాక్ క్రికెటర్లు, సెలబ్రిటీలు, సినీ యాక్టర్లకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను, యూట్యూబ్ ఛానెళ్లను ఇండియా బ్లాక్ చేస్తోంది.
తాజాగా, క్రికెటర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఇప్పటికే, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. అలీ ఫజల్, హానియా అమీర్, మిహిరా ఖాన్ వంటి 16 మంది సెలబ్రెటీల ఇన్‌స్టా అకౌంట్లను కూడా భారత్ నిషేధించింది. వీరితో పాటు ఒలింపిక్ బంగారు పతక విజేత జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఇన్‌స్టా ఖాతాను గురువారం బ్లా్క్ చేయబడింది.
పాకిస్తాన్ ప్రముఖుల ఇన్‌స్టా పేజ్‌ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో, యూజర్లకు ‘‘ఇండియాలో ఈ అకౌంట్ అందుబాటులో లేదు’’ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్‌కి అనుకూలంగా, భారత్ వ్యతిరేకంగా రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్‌ని వ్యాప్తి చేసే, తప్పుదారి పట్టించే కథనాలను ప్రచురించే అనేక పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది.
