Amit Shah: జనవరి 1, 2024కి రామమందిరం సిద్ధం.. అమిత్ షా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya’s Ram Mandir Will Be Ready By Jan 1, 2024- Amit Shah’s Big Announcement: అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 1, 2024కి రామ మందిరం సిద్ధం అవుతుందని ప్రకటించారు. బీజేపీ ‘జన్ విశ్వాస్ యాత్ర’ త్రిపురలో ప్రారంభించిన అమిత్ షా ఈ ప్రకటన చేశారు. త్రిపురలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ తన ప్రచారాాన్ని ప్రారంభించింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ టార్గెట్ గా అమిత్ షా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ రాహుల్ బాబా వినండి.. నేను రామ మందిరం తెరవడానికి తేదీలు ప్రకటిస్తున్నాను’’ అంటూ జనవరి 1, 2024 నాటికి అయోధ్య రామమందిరం సిద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
Read Also: Viral : సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోన్న ఆరేళ్ల క్యాన్సర్ చిన్నారి కథనం
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్‌పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతోంది. 2019, నవంబర్ నెలలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రామ మందిర వివాదానికి ముగింపు పలికింది. మెజారిటీ వర్గాలని అనుకూలంగా ఏకగ్రీవంగా తీర్పును వెల్లడించింది. అదే సమయంలో వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని సూచించింది. ఆగస్టు 5, 2020న రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చూస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దేవీదేవతా విగ్రహాలను ప్రతిష్టించిన తర్వాత 2024 జనవరిలో భక్తుల కోసం తెరుస్తానమని ట్రస్ట్ వెల్లడించింది
రామ మందిరం ప్రత్యేకతలు:
మహోన్నతమైన రామ మందిర నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఆలయ విస్తీర్ణంలో 2.77 ఎకరాల్లో గ్రానైట్ రాళ్లను వినియోగిస్తున్నారు. ఆలయంలో మొత్తం 392 స్తంబాలు ఉంటాయిన.. దాదాపుగా 12 ద్వారాలను నిర్మించనున్నట్లు సమాచారం. గర్భగుడిలో 160 స్తంభాలు, మొదటి అంతస్తులో 132 స్తంభాలు ఉంటాయి. ఆలయాన్ని భూకంపాలు కూడా ఏం చేయలేని విధంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..