Yogi Adityanath: అయోధ్యలో సీఎం యోగి గుడి.. ప్రతిరోజు రెండుసార్లు పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: అయోధ్య అనగానే అందరికి గుర్తొచ్చేది రాముడు పుట్టిన స్థలం అని.. అదే అయోధ్యలో ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు గుడికట్టి రాముడిగా పూజిస్తున్న వార్త సంచలనం రేపుతోంది. ప్రభాకర్ మౌర్య అనే ఆధ్యాత్మిక గాయకుడు యోగి ఆదిత్యనాథ్ కు భక్తుడిగా మారిపోయారు. యోగి ఆదిత్యనాథ్ రాముడిగా గుడి కట్టించి ఇటీవలే ప్రారంభించారు. యోగి ఆదిత్యనాథ్‌పై అభిమానంతో ఏకంగా గుడినే కట్టించాడు ఆ యువకుడు.
అయోధ్యకు చెందిన 32 ఏళ్ల ప్రభాకర్ మౌర్య భరత్‌కుండ్ సమీపంలోని పుర్వా గ్రామంలో రాముడి అవతారంలో ఉన్నట్టుగా యోగి విగ్రహాన్ని తయారు చేయించి గుడిలో ఏర్పాటు చేశాడు. రోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తూ యోగి పట్ల తన ఆరాధనా భావాన్ని చాటుకొంటున్నాడు. అయోధ్యలోని రామ జన్మభూమికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది భరత్‌కుండ్. వనవాసానికి వెళ్లే ముందు.. రాముడికి ఇక్కడే భరతుడు వీడ్కోలు పలికాడని చెబుతుంటారు. అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ మౌర్య అనే వ్యక్తికి యోగి ఆదిత్యనాథ్ అంటే అమితమైన అభిమానం. అందుకే ఆయన కోసం ఫైజాబాద్-ప్రయాగ్‌రాజ్ హైవే పక్కన గుడి కట్టేశాడు. కాషాయ వస్త్రధారణతో చేతిలో విల్లు, బాణంతో శ్రీరాముడు విగ్రహాన్ని పోలినట్టుగా గుడిలో ప్రతిష్ఠించాడు. శ్రీరాముడిని పూజించినట్టే యోగి విగ్రహం ముందు రోజూ శ్లోకాలు పఠిస్తుంటానని యువకుడు పేర్కొన్నాడు.
Also Read
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
Amarinder Singh: బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్.. పార్టీ కూడా విలీనం
అయోధ్యలో రామాలయం నిర్మాణం కావాలన్నది తన కల అని, రాముడి గుడి ఎవరు కట్టిస్తే వారికి గుడి కట్టి పూజ చేస్తానని 2015లో శపథం చేశానని ప్రభాకర్ మౌర్య తెలిపారు. ఆ కలను నెరవేరుస్తున్న యోగి ఆదిత్యనాథ్ కూడా రాముడేనని పేర్కొన్నారు.ఈ ఆలయం కట్టడానికి సుమారు రూ.8.5 లక్షలు ఖర్చు అయిందని, రాజస్థాన్ లో విగ్రహాన్ని తయారు చేయించి తెచ్చి ప్రతిష్టించానని ప్రభాకర్ మౌర్య వెల్లడించారు. తనకు భూమిగానీ, ఉద్యోగం గానీ లేదని.. యూట్యూబ్‌లో భజనలు, మతపరమైన పాటలను పోస్ట్ చేయడం ద్వారా నెలకు దాదాపు రూ.లక్ష దాకా సంపాదిస్తానని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు మహారాష్ట్రలోని పూణె సమీపంలో మయూర్ ముండే అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీకి గుడి కట్టించారు. దానిని గత ఏడాది స్వాతంత్య్రం దినోత్సవం రోజున తెరిచి పూజలు కూడా ప్రారంభించారు.
తాజావార్తలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!