Ayodhya Ram Mandir Ceremony SCAMs: భారతదేశంలో, ఏ విషయం ఎక్కువగా చర్చించబడుతుందో, దాని పేరుతో మోసాలు చేయడం మొదలు పెడతారు కేటుగాళ్లు. ప్రస్తుతం అయోధ్య రామ మందిరం గురించి దేశం మొత్తం చర్చ జరుగుతోంది. రామ మందిరం కోసం ప్రజలు విరాళాలు కూడా ఇస్తున్నారు. అంతేకాదు జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు కానీ సామాన్యులను ఆరోజు మాత్రం అనుమతించడం లేదు. జనవరి 22న, ఆహ్వానం అందుకున్న అతి తక్కువ మంది వ్యక్తులు మాత్రమే అయోధ్యకు వెళ్లగలరు. ఈ క్రమంలో సైబర్ కేటుగాళ్లు రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం రామాలయంలో విరాళాలు, ప్రసాదం, వీఐపీ పాస్‌లను ఎర చూపిస్తూ అనేక రకాల మోసాలు చేస్తున్నారు.
Battery Tips: ఈ ఐదు పనులు చేస్తే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.. జరజాగ్రత్త!
జనవరి 22న అయోధ్యలో ప్రవేశించేందుకు వీఐపీ పాస్‌లు వాట్సాప్‌లో షేర్ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పాస్‌లను అడ్మినిస్ట్రేషన్ పంపడం లేదు, సైబర్ కేటుగాళ్లు పంపుతున్నారు. వాట్సాప్‌లో పంపబడుతున్న సందేశం ప్రకారం, “జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి మీరు VIP పాస్‌ను పొందుతున్నారు; అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా VIP పాస్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.” అని అంటూ చాలా మందికి వాట్సాప్‌లో సేవ్ చేయమని సందేశం వచ్చింది. ఈ పాస్‌ని చూపడం ద్వారా, మీరు జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అనుమతించబడతారు. అని అంటూ ఆ సందేశంతో పాటు, యాప్ APK ఫైల్ కూడా పంపుతున్నారు. ఉచిత VIP పాస్ కోసం ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోమని ప్రజలను కోరుతున్నారు. నిజానికి, హ్యాకర్లు ఈ APK ఫైల్ ద్వారా మీ ఫోన్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి యత్నిస్తున్నారు. మాల్వేర్ ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత, వారు మీ ఫోన్‌ను రిమోట్‌గా పూర్తిగా నియంత్రించగలరు. ఆ తర్వాత వారు మీ బ్యాంక్ ఖాతాలు కూడా ఖాళీ చేయచ్చు.
ఇదొక ఎత్తు అయితే రామాలయం పేరుతో చాలా పేజీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారాయి. ఒక పేజీలో QR కోడ్ కూడా షేర్ చేసి వ్యక్తుల నుండి విరాళాలు అడుగున్నారు. దీంతో సోషల్ మీడియా ద్వారా రామమందిరం పేరుతో విరాళాలు ఇవ్వకండని నిపుణులు చెబుతున్నారు. ఇక రామాలయంలో ప్రతిష్ఠాపన తర్వాత మీ ఇంటికి ప్రసాదాన్ని అందజేస్తామని పేర్కొంటున్న అనేక వెబ్‌సైట్‌లు కూడా గుర్తించబడ్డాయి. ఈ సైట్లు కూడా ప్రసాద్ కోసం బుకింగ్స్ తీసుకుంటున్నాయి. ఖాదీ ఆర్గానిక్ పేరుతో అలాంటి సైట్ ఒకటి ఉంది. ఈ సైట్ ప్రజల ఇళ్లకు ప్రసాదాన్ని అందజేస్తానని చెబుతూ డబ్బు వసూలు చేస్తోంది. సో అలెర్ట్ గా లేకుంటే జేబులు గుల్ల కావడం ఖాయం.