NTV Telugu Site icon

Avadh Ojha: అరవింద్ కేజ్రీవాల్ ‘‘శ్రీకృష్ణుడి అవతారం’’

Aap

Aap

Avadh Ojha: ఐఏఎస్, ఐపీఎస్ వంటి యూపీఎస్సీ కోచింగ్‌కి పేరు తెచ్చుకున్న ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. తాజాగా ఆయన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్‌ని దేవుడితో పోల్చారు. ఒక ఇంటర్వ్యూలో ఓజా ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Sheikh Hasina: షేక్ హసీనా, కుటుంబపై మరో నేరం.. 5 మిలియన్ డాలర్ల అవినీతిపై విచారణ..

‘‘అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా దేవుడే. ఆయన కృష్ణుని అవతారమని ఇదివరకే చెప్పాను. ఎవరైనా సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించినప్పుడల్లా, వారు పేదలకు మెస్సయ్యగా మారుతారు, సామాజిక దురాచారాలకు రూపుమాపడానికి ప్రజలు ఆయన వెంట వెళ్తారు.’’ అని అన్నారు. కేజ్రీవాల్ సమాజంలో పేద వర్గాల కోసం పనిచేయడం సామాజిక దుష్టులకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ పరిస్థితి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, 2029లో కేజ్రీవాల్ దేశానికి ప్రధాని అవుతారని కొందరు భయపడుతున్నారని, ఆయన భగవంతుడు అని నాకు ఎలాంటి సందేహం లేదని, అతను విద్యను ఉచితంగా అందించారని అవధ్ ఓజా ప్రశంసించారు.

అవధ్ ఓజా రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి ఆప్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోటీ చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సిసోడియా జంగ్‌పురా నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన అవధ్ ఓజా యూపీఎస్‌సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి శిక్షణ అందించడంతో పేరుగాంచారు. అంతర్జాతీయ, దేశీయ రాజకీయాల గురించి వివరంగా చెప్పడంలో నిష్ణాతులు.

Show comments