ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!
- రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి
- సూరత్‌లో విచిత్రమైన సంఘటన
- ఓ బ్యాంక్ ఖాతాదారుడు భారీ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏటీఎం సెంటర్లలో అప్పుడప్పుడు టెక్నికల్ సమస్యలు వస్తుంటాయి. ఏటీఎం కార్డు పెట్టినప్పుడు డబ్బులు రాకుండా నిష్క్రమించాక నగదు వచ్చిన దాఖలాలు ఎదురవుతుంటాయి. కానీ ఆ డబ్బు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంటాయి. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. దీంతో బాధితులు లబోదిబో అంటుంటారు.
ఇక సూరత్‌లో విచిత్రమైన సంఘటన కస్టమర్‌కు ఎదురైంది. సూరత్‌కు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుడు ఎస్బీఐ ఏటీఎం నుంచి రూ. 10,000 విత్‌డ్రా చేశాడు. కానీ ఏటీఏం సాంకేతిక లోపం కారణంగా నగదు రాలేదు. రసీదు కూడా రాలేదు. కానీ 10, 000 విత్‌డ్రా అయినట్లుగా 2017 ఫిబ్రవరి 18న మెసేజ్ వచ్చింది. దీంతో వినియోగదారుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 2017 ఫిబ్రవరి 21న బ్యాంక్ ఆఫ్ బరోడా డంభల్ శాఖలో లిఖితపూర్వకంగా బాధితుడు ఫిర్యాదు చేశాడు. కానీ బాధితుడి గోడు పట్టించుకున్న నాధుడు లేడు.
Also Read
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్‌తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
- UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ఆర్బీఐ, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక సీసీటీవీ ఫుటేజ్ పొందడానికి ఎస్బీఐలో ఆర్టీఐ అభ్యర్థనను దాఖలు చేశాడు. అయితే ఏ అధికారి కూడా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు లెక్కలేనన్ని ఈ-మెయిళ్లు, అనేక ఫిర్యాదులు చేశాడు. చివరగా డిసెంబర్ 20, 2017న వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా ఆ ఏటీఎం ఎస్బిఐకి చెందినదని.. తమ రికార్డుల్లో లావాదేవీ ‘‘విజయవంతంగా’’ కనిపించిందని.. అందువల్ల బ్యాంకు బాధ్యత వహించదని బ్యాంక్ ఆఫ్ బరోడా వాదించింది. అయితే వినియోగదారుల కమిషన్ బ్యాంక్ వాదనను తోసిపుచ్చింది. లావాదేవీకి సంబంధించిన పక్కా రుజువులను బ్యాంకు తప్పనిసరిగా అందించాలని పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని ఐదు రోజుల్లోగా వాపసు చేయాలని ఆదేశించింది. కానీ బ్యాంకు అలా చేయడంలో విఫలం కావడంతో కమిషన్ సీరియస్‌గా తీసుకుంది.
దీంతో అసలు రూ.10,000తో పాటు 9 శాతం వార్షిక వడ్డీతో వాపసు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆలస్యానికి రోజుకు రూ.100 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కూడా సూచించింది. దీంతో 2026 ఫిబ్రవరి 26 నాటికి జాప్యం 3,288 రోజులకు చేరింది. మొత్తం పరిహారం రూ. 3,28,800కు పెరిగింది. ఇక మానసిక వేధింపులకు గాను రూ. 3,000, న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ. 2,000 చెల్లించాలని కూడా బ్యాంకుకు కమిషన్ ఆదేశించింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు అసలు మొత్తానికి దాదాపు 30 రెట్లు చెల్లించవలసి వస్తోంది. ఈ సీన్ చూస్తుంటే.. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడమంటే ఇదేనేమో అనిపిస్తోంది.
తాజావార్తలు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?