Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Crime Thriller Movies: ప్రేమ, నమ్మకం, ద్రోహం… ఈ మూడు కలిసి కొన్ని సందర్భాల్లో ఊహించని విషాదాలకు దారితీస్తాయి. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు కూడా అలాంటి షాకింగ్ ఘటనగానే నిలిచింది. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించినట్లు భావించిన ఈ ఘటన, పోలీసుల దర్యాప్తులో పక్కా ప్లాన్ తో చేసిన హత్యగా వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు నేపథ్యంలో ప్రేమ, మోసం, హత్య, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది. అలాంటి కథాంశాలతో రూపొందిన కొన్ని సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో ఆదరణ పొందుతుండటం విశేషం.
ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సిన సినిమా ‘కర్జ్’. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో 1980లో విడుదలైన ఈ క్లాసిక్ చిత్రంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి చేతిలో హీరో దారుణమైన కుట్రకు బలవుతాడు. ఆస్తి కోసం భర్తను లోయలోకి తోసి హత్య చేసే సన్నివేశం ఈ సినిమాలో కూడా హైలెట్ గా ఉంటుంది. పునర్జన్మ, ప్రతీకారం, సెంటిమెంట్ తో సాగే ఈ చిత్రం ఇప్పటికీ బాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ సినిమా ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read
ప్రేమ, అక్రమ సంబంధం, హత్య, పోలీసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే మరో ఆసక్తికర చిత్రం ‘హసీన్ దిల్రూబా’. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భర్త మర్డర్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఒక్కో దశలో బయటపడుతూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. కథలో వచ్చే ట్విస్టులు చివరి వరకు ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది.
సైకలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ‘గాన్ గర్ల్’ తప్పకుండా చూడాల్సిన చిత్రం. పెళ్లి వార్షికోత్సవం రోజున భార్య కంపించకుండా పోవడం, భర్తనే నిందితుడిగా పోలీసులు అనుమానించడం, ఆ తర్వాత బయటపడే అసలు నిజాలు కథను పూర్తిగా మరో మలుపు తిప్పుతాయి. భార్య ఆడే మైండ్ గేమ్‌లు, ట్విస్ట్‌లు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకునేలా చేశాయి. ప్రస్తుతం ఈ చిత్రం JioHotstarలో తెగ ట్రెండ్ అవుతోంది.
సస్పెన్స్ సినిమాల గురించి మాట్లాడితే ‘అంధాధున్’ను మర్చిపోలేం. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఒక హత్యను దాచిపెట్టేందుకు వేసే ప్లాన్ లు, అంధుడైన పియానిస్ట్ చుట్టూ తిరిగే కథనం, వరుస ట్విస్టులు ఈ చిత్రాన్ని అత్యుత్తమ క్రైమ్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలబెట్టాయి. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ప్రస్తుతం JioCinemaలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలను చూస్తున్నప్పుడు కేతన్ అగర్వాల్ కేసు మన కళ్ళముందు కనబడుతుంది. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ సినిమాలు ఓటీటీలో కావాల్సిన థ్రిల్ ఇస్తాయి. ప్రస్తుతం ఈ రీల్ లైఫ్ లోనూ, రియల్ లైఫ్ లో ఈ క్రైమ్ ట్రెండ్ కొనసాగుతుండటం విశేషం.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!