WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Username Feature: వాట్సాప్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై నెలకొన్న సందేహాలకు మెటా సంస్థ స్పష్టత ఇచ్చింది. ఈ ఫీచర్ వల్ల సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించింది. ఇటీవల ఈ ఫీచర్‌పై ప్రభుత్వం నోటీసు జారీ చేసిన నేపథ్యంలో దీనిపై చర్చ మరింత పెరిగింది. మెటా వెల్లడించిన వివరాల ప్రకారం.. వాట్సాప్‌లో యూజర్‌నేమ్ సృష్టించడం పూర్తిగా ఐచ్ఛికం. వినియోగదారులు కోరుకుంటే మాత్రమే యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫేస్బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపయోగంలో ఉన్న కొన్ని యూజర్‌నేమ్‌లు, అలాగే ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, ధృవీకరించబడిన ఖాతాలకు సంబంధించిన పేర్లు రక్షితంగా ఉంటాయని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం అందుబాటులో లేదు..
యూజర్‌నేమ్‌లను ఉపయోగించి సందేశాలు పంపే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో లేదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ ఫీచర్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తి సందేశం పంపితే, అతని దేశ వివరాలతో పాటు హెచ్చరిక సందేశం కూడా కనిపిస్తుందని తెలిపింది. అంతేకాకుండా అనుమానాస్పద ఖాతాలు, మోసపూరిత కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Also Read
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
యూజర్‌నేమ్ తెలుసుకున్నా మెసేజ్ చేయలేరు..?
యూజర్‌నేమ్‌ను ఎవరైనా తెలుసుకున్నంత మాత్రాన మీకు నేరుగా సందేశాలు పంపలేరని కూడా కంపెనీ స్పష్టం చేసింది. వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌లను నేరుగా శోధించే అవకాశం ఉండదని, అదనపు భద్రత కోసం “యూజర్‌నేమ్ కీ” అనే ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కీని వినియోగదారులు ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
అలా అయితే లింక్ చేయాల్సిందే..!
అదే యూజర్‌నేమ్‌ను ఫేస్బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపయోగించాలనుకుంటే ఆయా ఖాతాలను లింక్ చేయాల్సి ఉంటుందని మెటా పేర్కొంది. అయితే, పూర్తిగా కొత్త యూజర్‌నేమ్‌ను కూడా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే యూజర్‌నేమ్‌ను భవిష్యత్తులో అవసరమైతే మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది.
రిజర్వ్ చేయడం సాధ్యం కాదు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లుగా ప్రముఖుల పేర్లను ఎవరైనా ముందుగానే రిజర్వ్ చేసుకోవడం సాధ్యం కాదని మెటా ఖండించింది. ఆ పేర్లను ఆయా అసలు యజమానులు లేదా ధృవీకరించబడిన ఖాతాలే ఉపయోగించగలవని వివరించింది. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ ఏడాది చివర్లో యూజర్‌నేమ్ ఫీచర్‌ను అధికారికంగా అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!