Assam Rifles: అస్సాం రైఫిల్స్ శిబిరాలపై ఉగ్రదాడులు

Assam Rifles

Assam Rifles

Assam Rifles: నాగాలాండ్‌లోని నోక్లక్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అస్సాం రైఫిల్స్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇండో-మయన్మార్ సరిహద్దులో ఉన్న డాన్ పాంగ్షా ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు నోక్లక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హియాజు మేరు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. “ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదు. ఈ ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం, మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్య కూడా ఉంది” అని మేరు చెప్పారు.

Commonwealth Games 2002: గేమ్స్ కోసం వెళ్లి.. మాయమైన 10 మంది లంక అథ్లెట్లు

×
×
Ad

ఈరోజు తెల్లవారుజామున, అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్ చాంగ్లాంగ్‌లోని జెన్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ సిబ్బందిపై ఇలాంటి కాల్పుల ఘటన జరిగింది. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం కోసం అధిక నిఘా దృష్ట్యా దళాలు మెరుగైన పెట్రోలింగ్ కార్యకలాపాలను చేపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జేసీవో) చేతికి చిన్న గాయమైంది. ఈశాన్య భారత్‌లోని పలు రాష్ట్రాల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని ఉల్ఫా-ఐ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్‌ పరేష్‌ బారువా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇతర గాయాలు లేదా నష్టం ఇప్పటివరకు నివేదించబడలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.