Assam police arrest 2 imams links to Al Qaida, Bangla jihadi outfit: అస్సాం రాష్ట్రంలో ఉగ్రవాదుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో అస్సాంలో పలు జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. ఉపఖండంతో అల్ ఖైదా కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న అన్సరుల్లా బంగ్లా టీమ్ కార్యకలాపాలు అస్సాంలో చాపకింద నీరులా పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో ఇద్దరు ఇమామ్‌లను అరెస్ట్ చేశారు అస్సాం పోలీసులు. వీరద్దరికి ఆల్ ఖైదాతో పాటు అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గోల్ పరా జిల్లాలో వీరిద్దరిన అరెస్ట్ చేశారు. జీహాదీ స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఉగ్రవాదులు. నాలుగు నెలల్లో ఇప్పటి వరకు 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలైలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అబ్బాస్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇతడు ఇచ్చిన సమాచారంతో ఇమామ్‌ల అబ్దుస్ సుభాన్, జలాలుద్దీన్ షేక్ లను అరెస్ట్ చేశామని.. గోల్ పారా ఎస్పీ వీవీ రాకేష్ రెడ్డి తెలిపారు.
Read Also: Etela Rajender: కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటే.. తెలంగాణ ప్రజలు క్షమించరు
అరెస్ట్ అయిన ఇద్దరి వద్ద నుంచి జీహాదీ సాహిత్యాన్ని, పోస్టర్లు, పుస్తకాలు, సిమ్ కార్డులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆల్ ఖైదాకు సంబంధించిన ఉగ్రవాద సాహిత్యాన్ని కనుక్కున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు స్లీపర్ సెల్స్ కోసం వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు తెలిసింది. గత నాలుగు నెలల్లో మొత్తం 6 అన్సరుల్లా బంగ్లా టీమ్ టెర్రర్ మాడ్యుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వద్ద వివరాల ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులు అస్సాంలో స్థానిక యువకులను జీహాదీ భావజాాలన్ని భోధించడం ద్వారా టెర్రర్ మాడ్యుళ్లను, స్లీపర్ సెల్స్ ను సృష్టిస్తున్నారని పోలీసులు చెప్పారు.