వెరైటీగా వెడ్డింగ్ రిసెప్షన్.. ఆసియాలోనే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో పెళ్ళిళ్లు కళ్లు చెదిరేలా జరుగుతున్నాయి. అయితే కరోనా పరిస్థితుల వల్ల వివాహాలు వినూత్నంగా వర్చువల్ పద్ధతిలో చేయడం చూస్తున్నాం. ఈ కోవలోకే మరో వివాహ వేడుక చేరింది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యతోనే తమిళనాడుకు చెందిన ఓ జంట వివాహం చేసుకుంది. కానీ మ్యారేజ్ రిసెప్షన్‌ని మాత్రం మెటావర్స్ టెక్నాలజీ సహాయంతో అంగరంగ వైభవంగా జరుపుకుంది. మెటావర్స్ టెక్నాలజీతో ఆసియా ఖండంలో జరిగిన తొలి వెడ్డింగ్ రిసెప్షన్ ఇదే కావడం విశేషం.
శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్, జనగనందిని వివాహం ఈనెల 6న జరిగింది. దినేష్ ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. జనగనందిని సాప్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ప్రేమలో పడి పెద్దలను వివాహానికి ఒప్పించారు. వివాహం తర్వాత అనంతరం రిసెప్షన్ వేడుకను మాత్రం వీరు 3డీ టెక్నాలజీ సాయంతో జరుపుకున్నారు. ఈ టెక్నాలజీ సహాయంతో ఎక్కడో ఉన్న ఓ వ్యక్తి.. మన ముందున్నట్టు.. మాట్లాడుతున్నట్టుగా ఊహాజనితంగా ఉంటుంది. అందుకే వరుడు దినేష్ ఈ టెక్నాలజీ సహాయంతో తన మ్యారేజ్ రిసెప్షన్ ఎంత గ్రాండ్‌గా ఉండాలని కోరుకున్నాడో.. అచ్చం అదే తరహాలో నిర్వహించుకున్నాడు.
Also Read
రియల్‌గా రిసెప్షన్ ఎలా జరుగుతుందో అచ్చం అలానే వర్చువల్‌గా మోటావర్స్ మ్యారేజ్ రిసెప్షన్ జరిగింది. అతిథులను ఆహ్వానించడం, పాట కచేరీ, విందు భోజనాలనాలు, బంధుమిత్రుల ముచ్చట్లు, వధూవరుల వస్త్రాలంకరణ అన్నీ కూడా మన కళ్లెదుట ఎలా జరుగుతుందని ఊహిస్తామో.. 3డీ టెక్నాలజీ సహాయంతో అలానే క్రియేట్ చేశారు.
Finally into Asia's 1st Metaverse Wedding. Interesting experience. @beyondlifeclub @TardiVerse @kshatriyan2811 pic.twitter.com/zhGPTuedOf
— Divit (@0xDivit) February 6, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!