NTV Telugu Site icon

Asaduddin Owaisi: ముస్లింలకు అనుమతి ఇవ్వడానికి ఆయన ఎవరు..? మోహన్ భగవత్ వ్యాఖ్యలపై అసద్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi angry over Mohan Bhagwat’s comments: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని.. ముస్లింలు తమ ఆధిపత్య ధోరణిని విడనాడాలని అన్నారు. హిందువులు గత 1000 ఏళ్లుగా విదేశీ దురాక్రమణదారుల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారని.. వీటన్నింటితో హిందూ సమాజం మేల్కొందని.. యుద్ధం చేసేవారు దూకుడు చూపడం సహజం అన్నారు. హిందుత్వం గురించి మరిచిపోయినప్పుడు హిందుస్థాన్ గా ఉన్న ఈ దేశం విభజనకు గురైందని అన్నారు.

Read Also: Siddipet Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

అయితే ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు భారతదేశంలో నివసించడానికి, మా విశ్వాసాన్ని అనుసరించడానికి అనుమతి ఇవ్వడానికి మోహన్ భగవత్ ఎవరు..? అని ప్రశ్నించారు. అల్లా కోరుకున్నందుకు మనం భారతీయులం అయ్యాం అని.. మన పౌరసత్వంపై షరతులు పెట్టడానికి అతనికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు. నాగ్ పూర్ లో ఉండే బ్రహ్మచారుల కోసం మా విశ్వసాలను మార్చుకునేందుకు మేం ఇక్కడ లేము అని అన్నారు. ఆప్రతీ మైనారిటీ ఎలా భావిస్తారో వదిలేయండి.. ఆర్ఎస్ఎస్ బూటకపు మాటలను నమ్మే హిందువులు చాలా మంది ఉన్నారని అన్నారు. మీరు మీ సొంతదేశంలోనే విభజన బీజాలు నాటుతున్నారని అన్నారు. ఇతర దేశాల ముస్లిం నేతలను కౌగిలించుకునే ప్రధాని మోదీ.. తన దేశంలో ముస్లింలను ఎందుకు కౌగిలించుకోరు అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందిస్తూ.. ‘‘హిందుస్థాన్ హిందస్థాన్ గా ఉండాలి.. మనుషులు మనుషులుగా ఉండాలి అని ట్వీట్ చేశారు.