Asaduddin Owaisi angry over Mohan Bhagwat's comments: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని.. ముస్లింలు తమ ఆధిపత్య ధోరణిని విడనాడాలని అన్నారు. హిందువులు గత 1000 ఏళ్లుగా విదేశీ దురాక్రమణదారుల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారని.. వీటన్నింటితో హిందూ సమాజం మేల్కొందని..…