Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సరికొత్త వివాదం
- ఆర్ఎస్ఎస్ జడ్జ్‌ల ముందు హాజరుకాను
- జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సరికొత్త వివాదానికి దారి తీస్తోంది. ఫిబ్రవరి 27న లిక్కర్ స్కామ్ కేసును ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.
అయితే ఈ కేసు జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్‌కు వెళ్లింది. అయితే జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి ఉన్నారని.. బీజేపీ అనుబంధ సమావేశాల్లో పాల్గొన్నారని.. ఇలాగైతే తమకు న్యాయం జరగదని.. తన కేసు నుంచి స్వర్ణకాంత శర్మను తప్పించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్‌ను ఇటీవల న్యాయస్థానం కొట్టేసింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజాగా జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కేజ్రీవాల్ లేఖ రాశారు. వ్యక్తిగతంగా గానీ న్యాయవాది ద్వారా గానీ ఆమె ఎదుట హాజరుకాబోనని లేఖలో పేర్కొన్నారు. ‘‘జస్టిస్ స్వర్ణకాంత నుంచి న్యాయం లభిస్తుందన్న నా ఆశలు ఆవిరయ్యాయి. అందువల్ల నేను గాంధీజీ సత్యాగ్రహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. నా మనస్సాక్షి ఆధారంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు ఇస్తే.. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కును నేను కలిగి ఉంటాను.’’ అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
2024లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేసింది. అనంతరం 2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. అనూహ్యంగా ఈ కేసును గత ఫిబ్రవరి 27, 2026న ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు. ఆమె ఆర్ఎస్ఎస్ సానుభూతిపరురాలని.. అలాగైతే ఈ కేసులో తమకు న్యాయం జరగదని.. విచారణ నుంచి తప్పించాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 20న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. తాజాగా ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాబోనని తేల్చి చెబుతూ కేజ్రీవాల్ లేఖ రాశారు.
AAP National Convenor Arvind Kejriwal writes to Justice Swarana Kanta Sharma stating that he will not appear before her in person or through a lawyer.
Kejriwal writes, "My hope of getting justice from Justice Swarn Kanta is shattered. Therefore, I have decided to follow… pic.twitter.com/PIgznx0LUQ
— ANI (@ANI) April 27, 2026
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!