మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితులు ముస్కాన్, సాహిల్ శుక్లాకు చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైల్లో నటుడు, బీజేపీ నేత అరుణ్ గోవిల్ రామాయణం పుస్తకాలను అందజేశారు. జైల్లో మొత్తం 1.500 కాపీలను ఖైదీలకు పంపిణీ చేశారు. ‘‘ఘర్ ఘర్ రామాయణం’’ అనే కార్యక్రమంలో భాగంగా మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్ ఈ విధంగా చేశారు.