ఏళ్లు గడిచే కొద్ది ఎన్డీఏ అభివృద్ధి చెందుతుంది: ఎంఎం నరవణే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏళ్లు గడిచే కొద్ది ఎన్డీఏ( నేషనల్ ఢిపెన్స్ అకాడమీ) అభివృద్ధి చెందుతుందని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఎన్డీఏ 141వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏలో మహిళల ప్రవేశంతో వారికి సాధికారత లభిస్తుందని తెలిపారు.
రానున్న 40 ఏళ్లలో వారు ప్రస్తుతం తానున్న హోదాలో ఉంటారని తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది ఎన్డీఏలో కరిక్యూలం మారుతోంది. శిక్షణ పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయన్నారు. కోర్సు కటెంట్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. కొత్త సవాళ్లను ఎదుర్కొ నేందుకు సన్నద్ధమయ్యాం అన్నారు. ఇప్పుడు అకాడమీలో మహిళా కేడెట్లను చేర్చుకుంటున్నాం. వారు పురుషుల కన్నా మెరుగైనా ప్రదర్శన కనబర్చుతారని ఆశిస్తున్నట్టు నరవణే పేర్కొన్నారు.
Also Read
శిక్షణ ప్రమాణాల్లో మార్పు ఉండదు..
వచ్చే 20-30 ఏళ్లలో సాయుధ దళాల్లో మహిళల పాత్ర కీలకంగా మారుతుందన్నారు. మహిళలు ఎన్డీఏలో చేరుతున్నందుకు ఏవైనా మార్పులు ఉంటాయ అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు స్వల్పంగా మారతాయన్నారు. కానీ శిక్షణ ప్రమాణాల్లో ఎలాంటి తేడా ఉండబోదని స్పష్టం చేశారు.
ఇప్పటికే చెన్నైలోని ఓటీఓ( ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ)లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం గర్వకారణంగా ఉందని నరవణే వివరించారు. తాను 42 ఏళ్ల కిందట తాను ఓ కేడెట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు. కాగా ఈ ఏడాది నవంబర్ నుంచి ఎన్డీఏ ప్రవేశ పరీక్షలకు మహిళా అభ్యర్థులకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
- Tags
- Army
- MM Naravane
- oto
- Women
తాజావార్తలు
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!