తోటి సైనికుడిని కాపాడబోయి.. ఓ సైనికాధికారి ప్రాణాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన సిక్కింలో చోటుచేసుకుంది. ఈ మేరకు సైనికాధికారి ధైర్యసాహసాలను భారత సైన్యం ప్రశంసించింది.
ఇది కూడా చదవండి: Nizamabad: జక్రాన్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. బావ బామ్మర్దుల మృతి
సిక్కిం స్కౌట్స్‌కు చెందిన 23 ఏళ్ల లెఫ్టినెంట్ శశాంక్ తివారీ గతేడాది డిసెంబర్‌లో వ్యూహాత్మక ఆపరేటింగ్ బేస్ వైపు రూట్ ఓపెనింగ్ పెట్రోలింగ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లాగ్ వంతెన దాటుతుండగా అగ్నివీర్ స్టీఫెన్ సుబ్బా కాలు జారింది. మునిగిపోతున్న స్టీఫెన్ సుబ్బాను కాపాడేందుకు లెఫ్టినెంట్ తివారీ నీటిలోకి దూకాడు. మరో సైనికుడు నాయక పుకార్ కటెల్ కూడా సాయం చేసే ప్రయత్నం చేశాడు. ఎలాగోలా స్టీఫెన్ సుబ్బాను పైకి తీసుకొచ్చారు. శశాంక్ తివారీ మాత్రం నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. తివారీ మృతదేహం దాదాపు 30 నిమిషాల తర్వాత 800 మీటర్ల దిగువన గుర్తించారు.
ఇది కూడా చదవండి: Ramakrishna : ఘనంగా ప్రారంభమైన ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ ..
తివారీ మృతిపై భారత సైన్యం స్పందించింది. తివారీ వయసు చిన్నదే అయినా.. ఆయన చేసిన సేవ రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే ధైర్యం నింపారని సైన్యం పేర్కొంది. తివారీ అంత్యక్రియల్లో పాల్గొన్న వారంతా కన్నీటి పర్యాంతం అయ్యారు. తివారీ ధైర్యం, విధి పట్ల అంకితభావం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. దుఃఖ సమయంలో భారత సైన్యం ఆయన కుటుంబానికి ఉంటుందని సైన్యం వెల్లడించింది.