దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గొప్ప నటుడు.. సాయం కోరినవారికి తోడుగా ఉంటూ జనాల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.. నటుడుగా, రియల్ హీరోగా అభిమానుల మనసును గెలుచుకున్నాడు.. ఈయన గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే..ఆయన ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.. భౌతికంగా దూరం అయిన కూడా మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఇది ఇలా ఉండగా..
ఆయన జీవించి ఉన్నంత కాలం తన సంపాదనలో సగం సామాజిక సేవ కోసమే ఉపయోగించారు. వృధ్ధాశ్రమాలు, అనాథశ్రమాలు, గోశాలలకు ఎంతో నగదును విరాళంగా ఇచ్చారు. వీటన్నింటికీ తోడు 1800 మంది ఆడపిల్లల చదువు ఖర్చుల సైతం ఆయన భరించారు. అతి చిన్న వయసులోనే ఆకస్మిక గుండెపోటుతో అప్పు మరణించడంతో ఆయన కుటుంబ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనలా మరెవరూ కూడా గుండెపోటుతో చనిపోకూడదని బావించి ప్రభుత్వంతో కలిసి ఓ పథకాన్ని తీసుకురానున్నట్లు అప్పట్లోనే వెల్లడించారు. తాజాగా ఇందుకు బీజం పడింది. పునీత్ రాజ్‌కుమార్ పేరుతో కర్ణాటక రాష్ట్రంలో ఒక హెల్త్ స్కీం ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు తెలిపారు..
ఆకస్మిక గుండె పోటుతో చనిపోయేవారి సంఖ్యను తగ్గించే ఉద్దేశ్యం తో ఈ స్కీమ్ కు అప్పు యోజన అనే పేరును పెట్టారు..పునీత్ రాజ్‌కుమార్ కుటుంబం అందించిన నిధులతో పాటు బడ్జెట్‌లోనూ కొంత మొత్తాన్ని కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్లనుఉపకరణాలను అందుబాటులో ఉంచుతామన్నారు.ఎవరైనా గుండెపోటుకు గురి అయితే ఆ పరికరం సాయంతో వారికి ప్రథమ చికిత్స అందించవచ్చునని తెలిపారు.. ఇక ఈ ప్రాజెక్టు ను మొదటగా జయదేవ ఆస్పత్రిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.. ఈ స్కీమ్ వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చునని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..