NTV Telugu Site icon

PM Modi: శివాజీ విగ్రహం కూలడంపై ప్రజలకు క్షమాపణలు చెప్పిన మోడీ

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాల్ఘర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంతో మీ మనసులు గాయపడ్డాయని తనకు తెలుసన్నారు. గాయపడిన హృదయాలకు క్షమాపణ చెబుతున్నట్లు మోడీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో దిగగానే మొట్టమొదట విగ్రహం కూలినందుకు శివాజీకి క్షమాపణ చెప్పానని.. మనసులు గాయపడినందుకు ఇప్పుడు ప్రజలకు కూడా క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని తెలిపారు.

ఇది కూడా చదవండి: Pilli Subhash Chandra Bose: రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే ఉంటాను..

‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను తాము దైవంగా భావిస్తాం. తీవ్రంగా గాయపడిన వారికి నేను శిరస్సు వంచి వారికి క్షమాపణలు చెబుతున్నాను. మన విలువలు వేరు. మనకు మన దైవం కంటే పెద్దది ఏమీ లేదు.’ అని ప్రధాని అన్నారు.

గతేడాది డిసెంబర్‌లో నేవీ డే వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఇది సడన్‌గా కూలిపోయింది. దీంతో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమి విగ్రహ నిర్మాణం విషయంలో అధికార ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం..

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి.. అధికారంలోకి రావాలని ఇండియా కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ సీట్లు సాధించడంతో ఆశలు పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: New Zealand: న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్ కీల‌క నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ తర్వాత..!