AP Deputy CM Pawan: తమిళనాడు రాష్ట్రంలోని మధురై పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. మధురైలో మురుగ భక్తర్గళ్ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదురైలో ఇన్ని లక్షల మంది ప్రజలు మధ్యలో మాట్లాడుతానని పేర్కొన్నారు. మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం, మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారి స్వరూపం.. మనం మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం.. అక్కడ ఆశీర్వాదం పొందుతున్నాం.. కుంకుమ, ప్రసాదం తీసుకుంటున్నాం.. కానీ ఒకప్పుడు మధురై ధ్వంసమైంది.. ప్రకాశించాల్సిన ఆలయంలో వెలుతురు లేదు.. కుంకుమ ఇవ్వాల్సిన ఆలయంలో ఇచ్చేవారూ లేరు.. పూజలు జరగలేదు.. ఆలయం మూసివేయబడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, 14వ శతాబ్ద ప్రారంభంలో మధురైను మాలిక్ కఫూర్ దోచుకున్నాడు.. ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసివేయబడింది.. అలాంటి మధురైలో చీకటి కాలంలో 14వ శతాబ్దం చివరలో మళ్లీ వెలుతురు పుట్టింది.. ఆ వెలుతురును వెలిగించినవాడు విజయనగర యువరాజు కుమార కంబణన్ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Dmitry Medvedev: మా అణ్వాయుధాలను ఇరాన్‌కు ఇస్తాం.. రష్యా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
ఇక, నేను 2014లో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో పార్టీ పెట్టినప్పుడు అనుకోలేదు.. ఈ లక్షల మంది ముందరా మాట్లాడుతానని అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. అయితే, ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు.. ముస్లిం కూడా తన మతాన్ని గౌరవించుకుంటాడు.. కానీ, హిందువులు మాత్రం తమ మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరామని ప్రశ్నించారు. ఇది అసలైన నకిలీ సెక్యులరిజం.. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా జీవిస్తున్నాను.. నా మతాన్ని గౌరవించడమే కాదు, ఇతర మతాలనూ గౌరవిస్తున్నాను, ఇది నా హక్కు అని పేర్కొన్నాడు. మీరు మా నమ్మకాన్ని అవమానించకండి.. మీ నమ్మకాన్ని మేము అవమానించడం లేదు కదా అని తెలిపారు. స్వయంగా ఆ శివపుత్రుడి వివాహం జరిగిన ఈ నేలను అపవిత్రం చేసేందుకు ఇప్పుడు కొన్ని శక్తులు బలంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ది.. ఇక్కడ పాలకులు కూడా ఆ శక్తులకు మద్దతు తెలుపుతున్నాయని చెప్పుకొచ్చారు. ఒక చెడు ఒక మంచికే అన్నట్టు.. అదీ హైందవ సమాజం మంచికే అని నేను భావిస్తున్నాను.. మార్పు తధ్యం, అనుకున్నది సాదిస్తాం.. మన ధర్మాం వైపు నిలబడుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
