మగవారిలో కొందరు లైంగిక సమస్యలతో బాధపడుతుంటారు. తమ భాగస్వామ్యాన్ని పూర్తిస్థాయిలో సుఖపర్చలేక, నానా తంటాలు పడుతుంటారు.
ఈ లైంగిక సమస్యల్ని చెక్ పెట్టేందుకు.. ఈ నేచురల్ ఫుడ్స్‌ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే చాలు. అవి మీ సెక్స్ డ్రైవ్‌ని పెంచడంలో దోహదపడతాయి.
కాఫీ: రోజుకు 2 కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగితే.. పురుషుల్లో అంగస్తంభన సమస్య ఉండదని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
ఎర్ర మిరపకాయ: ఇందులో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం.. మీ మెదడులోని ఆనంద కేంద్రాలను ఉత్తేజపరిచి, మిమ్మల్ని లైంగికంగా ప్రేరేపించేలా చేస్తుంది.
పాలకూర: ఆకు కూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. పురుషుల లైంగిక పనితీరును పెంచడంలో ఫోలిక్ యాసిడ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
క్యారెట్: క్యారెట్‌లోని కెరోటినాయిడ్స్.. మీ స్పెర్మ్ కౌంట్‌తో పాటు స్పెర్మ్ స్విమ్మింగ్ యాక్టివిటీని పెంచుతుంది. కాబట్టి, ఇది రెగ్యులర్‌గా తీసుకుంటే బెటర్.
యాపిల్: యాపిల్ తొక్కల్లో ఉండే ఆర్సెనిక్ యాసిడ్స్.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి, లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.
అవకాడో: అవకాడోలో స్మెర్మ్ కౌంట్ పెంచే విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. అలాగే టెస్టోస్టిరాన్ ఉత్పత్తి, స్పెర్మ్ సామర్థ్యంలో ముఖ్య పాత్ర పోషించే జింక్ని అందిస్తుంది.
టమోటా: ఇందులోని ఐసోఫాన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ.. స్పెర్మ్ కౌంట్‌ని పెంచడంతో పాటు ప్రొస్ట్రేట్ క్యాన్సర్‌ను నిరోధిస్తాయి.
ఓట్స్: ఇందులో ఉండే అమినో యాసిడ్.. అంగస్తంభన సమస్యకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది, టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా పెంచుతుంది.