NTV Telugu Site icon

Anti-rape bill: రేప్ చేస్తే మరణశిక్ష.. “అత్యాచార నిరోధక బిల్లు”కి బెంగాల్ అసెంబ్లీ ఆమోదం..

Mamata Bnerjee

Mamata Bnerjee

Anti-rape bill: కోల్‌కతా అత్యాచార ఉదంతం దేశవ్యాప్తం ఆందోళనకు కారణమైంది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో ఆమెపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటన కారణంగా ఇప్పటికే వెస్ట్ బెంగాల్‌లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సర్కారుకు ఈ ఘటన మాయని మచ్చగా మారింది. ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంపై కలకత్తా హైకోర్టు కూడా మండిపడి ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.

ఇదిలా ఉంటే, వరసగా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ‘‘అత్యాచార నిరోధక బిల్లు’’ని మమతా సర్కార్ ఈ రోజు బెంగాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు మరియు సవరణ) బిల్లు, 2024కి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అత్యాచార దోషుల చర్యలు బాధితురాలి మరణానికి దారి తీస్తే మరణశిక్ష విధించేలా ఈ కొత్త బిల్లు రూపొందించబడింది.

Read Also: CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..

అయితే, ఈ బిల్లు క్రిమినల్ చట్టం కిందికి వస్తుంది, ఇది ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి, ఈ చట్టంపై గవర్నర్‌తో త్వరగా సంతకం చేయించాలని బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారిని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయంలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది, సువేందు అధికారి బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాత తృణమూల్ చీఫ్ అన్నారు. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. రేపిస్టులకు కఠినమైన శిక్షలకు తాను ఎప్పుడూ మద్దతు ఇస్తానని చెప్పారు.

“ఈ (అత్యాచార నిరోధక) చట్టాన్ని తక్షణమే అమలు చేయాలనుకుంటున్నాము. ఇది మీ (రాష్ట్ర ప్రభుత్వం) బాధ్యత. మాకు ఫలితాలు కావాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. మాకు ఎలాంటి విభజన వద్దు, మేము మీకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాము… ఆమె (మమత ) ఏది కావాలంటే అది చెప్పగలదు, అయితే ఈ బిల్లు వెంటనే అమలు చేయబడుతుందని మీరు హామీ ఇవ్వాలి, ” అని సువేందు అధికారి కోరారు.

Show comments