NTV Telugu Site icon

Punjab: కాల్పులతో మారుమోగుతున్న పంజాబ్..11 రోజుల్లో 8 ఎన్‌కౌంటర్లు..

Punjab

Punjab

Punjab: పంజాబ్ రాష్ట్రం పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులతో దద్దరిల్లిపోతోంది. ఆదివారం రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుంది. ఈ రోజు తెల్లవారుజామున మోగా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లక్కీ పాటియాల్ గ్యాంగ్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుపై వచ్చిన గ్యాంగ్‌స్టర్లని పోలీసులు గమనించి, ఆపాలని కోరినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బైక్‌ని వదిలి పొలాల్లోకి పరిగెత్తారని, పోలీసులపై కాల్పులు జరిపారని మోగా డీఎస్పీ హరీందర్ సింగ్ తెలిపారు.

Read Also: Bihar: పూజారి హత్యతో బీహార్‌లో టెన్షన్ టెన్షన్.. కళ్లను పొడిచి, నాలుక కోసేసి పాశవికంగా చంపేసిన వైనం..

పోలీసులు ప్రతిదాడి చేయడంతో వారు లొంగిపోయారని, ఈ ఘటనలో ఒకరు తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డారని, పోలీసుల కాల్పుల్లో కాదని అధికారులు తెలిపారు. అరెస్టయిన గ్యాంగ్‌స్టర్ల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

పంజాబ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా గ్యాంగ్‌స్టర్ల కట్టడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ముఠాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 11 రోజుల్లో తాజాగా జరిగింది 8వ ఎన్‌కౌంటర్. ఇటీవల తమపై దాడులు చేసేందుకు వస్తే పోలీసులు ప్రతీకారం తీర్చుకుంటారని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బహిరంగ హెచ్చరిక జరిగిన తర్వాత ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మొహాలి, పాటియాలో నిన్న రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. దీంట్లో ఇద్దరు కారు దొంగల్ని, హత్య నిందితులను అరెస్ట్ చేశారు.

Show comments