Site icon NTV Telugu

Delhi Encounter: ఢిల్లీలో మరో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో నిందితుడు

Delhi Encounter3

Delhi Encounter3

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదయం 4 గంటలకు పోలీసులకు-వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియా మధ్య కాల్పులు జరిగాయి. మొదట నేరస్థుడు కాల్పులు జరపగా.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. నేరస్థుడు జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ రవీంద్రకు గాయాలు కాగా.. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ధరించిన మరో ఇద్దరు పోలీసులకు ప్రమాదం తప్పింది. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్‌ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ

ఎదురుకాల్పుల్లో పహాడియాకు గాయాలు కావడంతో చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో పహాడియా వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: US: హోవార్డ్ యూనివర్సిటీ దగ్గర కాల్పులు.. నలుగురు మృతి!

ఇటీవల రోహిణి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. సిగ్మా గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ సహా నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. ఈ నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లుగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసుల సంయుక్తంగా జరిపిన దాడిలో ఈ నలుగురు గ్యాంగ్‌స్టర్లు చనిపోయారు. అక్టోబర్ 22-23 మధ్య రాత్రి 2:20 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నలుగురు బీహార్‌లో అనేకమైన తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. సిగ్మా అండ్ కంపెనీగా ఈ గ్యాంగ్‌ పిలువబడుతుంది. ఈ ముఠాకు రంజన్ పాఠక్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నలుగురు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ కుట్రకు ప్రణాళిక రచించినట్లుగా పోలీసులు గుర్తించారు. కుట్ర ఛేదించే క్రమంలో పోలీస్ బృందాలు గాలిస్తుండగా గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు తెగబడడంతో పోలీసులు నలుగురిని హతమార్చారు.

 

Exit mobile version