Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!

  • తమిళనాడు బీజేపీకి అన్నామలై షాక్..
  • వరసగా కీలక నేతల రాజీనామాలు..
  • రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కార్యదర్శి రిజైన్..
Annamalai

Annamalai

Tamil Nadu: తమిళనాడు బీజేపీలో సంక్షోభం మొదలైంది. అన్నామలై రాజీనామా తర్వాత పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ రాజీనామా చేశారు. బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరి రాజీనామాతో బీజేపీకి భారీ షాక్ తగిలింది. కిందిస్థాయి క్యాడర్ కూడా అన్నామలై వెంట నడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

శుక్రవారం, అన్నామలై బీజేపీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు నితీన్ నబీన్ కూడా ధ్రువీకరించారు. రాజీనామా తర్వాత అన్నామలై మాట్లాడుతూ.. తమిళనాడులో ఒక కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వీడటానికి గల కారణాలను వివరించారు. తాను ప్రజల మధ్య జీవించి, వారితో కలిసి పనిచేయాలని అనుకున్నానని, బీజేపీ సొంతగా తమిళనాడులో పోటీ చేయాలని కొరుకున్నట్లు వెల్లడించారు. గత కొంత కాలంగా బీజేపీతో అభిప్రాయ భేదాలు ఉన్నట్లు చెప్పారు. గత డిసెంబర్‌లోనే రాజీనామా చేద్ధామని అనుకున్నానని, పార్టీ ఎన్నికలు అయ్యే వరకు ఆగాలని కోరినట్లు అన్నామలై వెల్లడించారు.

×
×
Ad