Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ

  • అన్నామలైకి మోడీ-అమిత్ షా ఆశీస్సులు లేవు..
  • తమిళనాడు బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
  • బీజేపీకి బీ-టీమ్ కాదని స్పష్టం చేసిన నాగేంద్రన్..
Annamalai

Annamalai

Annamalai: మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి, సొంత రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీతో అభిప్రాయ భేదాలు ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, పార్టీని వీడటంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు, మద్దతు అన్నామలై ప్రారంభించే రాజకీయ పార్టీకి లేదని చెప్పారు.

అన్నామలై ప్రారంభించబోయే కొత్త పార్టీ బీజేపీకి బీ-టీమ్ లాంటిదని చాలా మంది భావిస్తున్న తరుణంలో నాగేంద్రన్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. చాలా మంది చెబుతున్నట్లు అన్నామలై రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించడానికి మోడీ, అమిత్ షా ఆశీస్సులు పొందలేదని ఆయన అన్నారు. బీజేపీ వీడిన వారెవ్వరూ సొంతగా సక్సెస్ సాధించలేదని గుర్తు చేశారు. అలాంటి మాటలకు లొంగవద్దని, పార్టీని వీడవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని, ఎలాంటి నష్టం జరగదు అని ఆయన అన్నారు.

×
×
Ad