Annamalai: లోక్‌సభ బరిలో ‘‘సింగం అన్న’’.. తమిళనాట బీజేపీ తురుపుముక్క ‘‘అన్నామలై’’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: ద్రవిడ రాజకీయాల్లో జాతీయవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు కే అన్నామలై. బీజేపీకి తమిళనాడులో అన్నామలై ఒక తురుపుముక్కగా ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ చీఫ్ జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించే దిశగా ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. 39 ఏళ్ల ఈ మాజీ ఐపీఎస్ అధికారికి బీజేపీ అధిష్టానం పూర్తిగా స్వేచ్ఛనిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై లోక్‌సభ అరంగ్రేటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి లోక్‌సభ బరిలో నిలిపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
2021 చిన్న వయసులోనే బీజేపీ పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో చేరిన ఏడాదికే ఆయనకు అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించింది. తమిళనాడులో మాస్ లీడర్ల ఫాలోయింగ్ ఎక్కువ. ప్రస్తుతం ఈ చరిష్మా తెచ్చుకునేందుకు అన్నామలై ప్రయత్నిస్తున్నారు. స్ట్రిక్ట్ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్న అన్నామలై రియల్ ‘‘సింగం’’గా, ‘‘సింగం అన్నా’’గా ట్యాగ్ సంపాదించుకున్నారు.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
వ్యవసాయ కుటుంబం నుంచి:
కరూర్ జిల్లాలోని తొట్టంపుట్టిలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అన్నామలై గౌండర్ కమ్యూనిటీకి చెందిన వారు. తమిళనాడులోని కొంగు ప్రాంతంలో ఈ కమ్యూనిటీ ప్రాబల్యం ఎక్కువ. మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిని అన్నామలై 2011లో పోలీస్ ఫోర్స్‌లో చేరారు. కర్ణాటక క్యాడెర్ ఐపీఎస్ అయిన అన్నామలై, ఆ రాష్ట్రంలోని గుట్కా, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారు. అయితే, 8 ఏళ్ల కెరీర్ తర్వాత 2019లో రాజీనామా చేశారు. ఆ సమయంలో అతను బెంగళూర్ డిప్యూటీ కమిషనర్(సౌత్)గా ఉంటూ పదవికి రాజీనామా చేశారు.

Read Also: Himalayas: 2100 నాటికి హిమాలయాల్లోని 75 శాతం మంచు కనుమరుగు.. ఆసియా ప్రజలపై తీవ్ర ప్రభావం..
టార్గెట్ డీఎంకే, బీజేసీ సపోర్ట్:
తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా అధికార డీఎంకే పార్టీ అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. డీఎంకే టాప్ లీడర్ల అవినీతి గురించి ‘డీఎంకే ఫైల్స్’ ఆడియో టేపులను విడుదల చేసి సంచలనం సృష్టించారు. సెంథిల్ బాలాజీ, కె పొన్ముడి, ఎస్ జగత్రక్షకన్ మరియు ఇవి వేలు వంటి అనేక మంది మంత్రులు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు.
గతేడాది ఏఐడీఎంకే పార్టీతో తెగదెంపులు చేసుకున్న సమయంలో కూడా బీజేపీ అన్నామలైకి మద్దతు తెలిపింది. అన్నామలై 2024 లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం మొత్తం కవరయ్యేలా జూలై 8, 2023న తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలను కవర్ చేస్తూ “ఎన్ మన్, ఎన్ మక్కల్” పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు జనాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
ఈ వారం పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి తిరుప్పూర్ సభకు ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఏకంగా ఈ సభకు మూడు నుంచి నాలుగు లక్షల మంది హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే ద్రవిడ రాజకీయాల్లో అన్నామలై ఎదుగుదల తెలుస్తోంది. ఇటీవల ప్రముఖ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం 7 నుంచి 15 శాతం మధ్య ఉంటుందని చెప్పారు. బీజేపీకి తమిళనాడులో బలమైన పునాది ఏర్పాటు చేసిన ఘనత అన్నామలైదే అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!