Site icon NTV Telugu

Annamalai: బీజేపీలో అన్నామలై కదుపు, పోటీకి దూరం.. కారణం ఇదే..

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి భారీ దెబ్బ తాకే అవకాశం కనిపిస్తోంది. అన్నాడీఎంకే-బీజేపీ సీట్ షేరింగ్‌పై బీజేపీ నేత కే. అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల విషయంలో ఉన్న అభ్యంతరాలను ప్రస్తావిస్తూ అన్నామలై ఢిల్లీలోని పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు. బీజేపీ సులభంగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలను, ముఖ్యంగా ‘కినత్తుకడవు’ వంటి స్థానాలను అన్నాడీఎంకే తమకు కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: IPL 2026: మైదానంలోనే కాదు.. భారీ పారితోషకాలు అందుకోవడంలోనూ స్టార్ల పోటీ.! టాప్ 5 హైయెస్ట్ పెయిడ్ స్టార్స్ వీరే..

ఈ నేపథ్యంతో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనని అన్నామలై కేంద్ర నాయకత్వాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అసంతృప్తి బీజేపీ కింది స్థాయి కార్యకర్తల్లో కూడా ఉంది. సీట్ల పంపకం ఒప్పందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కినత్తుకడవులో బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీయే కూటమి తన సీట్ల పంపకం ఒప్పందాన్ని ఖరారు చేసింది. మొత్తం 234 నియోజకవర్గాలకు గాను అన్నాడీఎంకే 169 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలైన PMKకి 18, AMMKకి 11 సీట్లు దక్కాయి. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనున్నాయి. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.

Exit mobile version