NTV Telugu Site icon

Anand Mahindra: చర్చిల్‌కు ఇదే సమాధానం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..

Anand Mahindra

Anand Mahindra

సోషల్‌ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా యమ యాక్టీవ్‌గా ఉంటారు.. ఏ సందర్భాన్ని కూడా వదలరు.. ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించిన నేపథ్యంలో… గతంలో భారత్‌పై బ్రిటన్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కౌంటర్‌ ఇచ్చారు మహీంద్రా… రిషి సునాక్‌ యూకే ప్రధానమంత్రి అయ్యాక, భారతదేశం గురించి విన్‌స్టన్ చర్చిల్ యొక్క 1947 సిద్ధాంతం తప్పు అని ఎత్తిచూపారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ గతంలో భారతీయులపై వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గుర్తు చేసిన ఆయన.. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో.. భారత్‌లోని నాయకులందరూ తక్కువ స్థాయి కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ చర్చిల్ చేసిన వ్యాఖ్‌యలను గుర్తు చేస్తూ.. 75 ఏళ్ల తర్వాత భారత మూలాలున్న ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా చర్చిల్ మాటలకు జవాబు ఇచ్చారని, జీవితం అందమైనదంటూ ట్వీట్‌ చేశారు.

Read Also: Astrology : అక్టోబర్‌ 25, మంగళవారం దినఫలాలు

కాగా, భారతదేశం మరియు తూర్పు ఆఫ్రికా నుండి వచ్చిన హిందూ వలసదారుల వారసుడు అయిన 42 ఏళ్ల రిషి సునాక్‌.. సోమవారం మధ్యాహ్నం గడువు నాటికి చట్టసభ సభ్యుల నుండి దాదాపు 200 పబ్లిక్ నామినేషన్లను పొందారు.. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆయన ఎన్నికపై ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయులు సంబారాలు చేసుకుంటున్నారు. ఇదేకదా అసలైన దీపావళి అంటూ సెలబ్రేట్‌ చేసుకున్నారు.. బోరిస్ జాన్సన్ గద్దె దిగిన తర్వాత ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన లిజ్ ట్రస్.. కేవలం 45 రోజులకే ప్రధాని పీఠం నుంచి వైదొలగడం.. మరోసారి ప్రధాని పదవికి పోటీ నెలకొంది.. ప్రధాని పదవి రేసులోకి మళ్లీ బోరిస్ జాన్సన్, రిషి సునాక్ రావడం.. ఆ తర్వాత బోరిస్ తప్పుకోవడంతో.. రిషి ఎన్నిక జరిగిపోయింది.. భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు ఇప్పుడు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ఎన్నిక కావడంపై ప్రశంసలు కురిస్తున్నాయి.. ఈ సందర్భంలో రిషి సునాక్‌కు తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలుపుతూనే.. మాజీ ప్రధానికి కౌంటర్‌ ఇచ్చారు మన మహీంద్రా..