Diwali: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ‘‘దీపావళి’’పై ఉద్రిక్తత..
- అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ‘‘దీపావళి’’పై వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali: ‘‘హోలీ’’ వివాదం మరిచిపోక ముందే, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)లో మరో వివాదం చెలరేగింది. అక్టోబర్ 18న హిందూ విద్యార్థులు క్యాంపస్‌లో ‘‘దీపావళి’’ జరుపుకోవడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించడం వివాదాస్పదమైంది. అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నందున అక్టోబర్ 18 తర్వాత, ఒకటి రెండు రోజులకు వేడుకలు జరుపుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులను కోరింది. దీపావళి జరుపుకోవడంపై ఎలాంటి ఇబ్బంది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో హోలీకి ముందు యూనివర్సిటీలో గందరగోళం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ వారం ప్రారంభంలో మాస్ కమ్యూనికేషన్ విద్యార్థి అఖిల్ కౌషల్ అక్టోబర్ 18న NRSC క్లబ్లో దీపావళి వేడుకలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాశారు. అనుమతి ఇవ్వకుంటే విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ వద్ద దీపావళి జరుపుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. హోలీ సమయంలో తమకు అనుమతి ఇవ్వకుండా వర్సిటీ తప్పు చేసిందని, వారు మళ్లీ తెలివైన వారు అయితే మళ్లీ ఇదే తప్పును రిపీట్ చేయరని ఆయన అన్నారు. ఒక వేళ అనుమతి రాకుంటా యూనివర్సిటీ హిందూ విద్యార్థులు ఏఎంయూ ‘‘బాబ్-ఎ-సయ్యద్’’ గేట్ వద్ద వైభవంగా దీపావళి జరుపుకుంటారని అన్నారు.
Also Read
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
Read Also: Earbuds: లావా దీపావళి ఆఫర్.. కేవలం రూ. 21 కే ఇయర్‌బడ్స్..
దీనిపై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వసీం అలీ మాట్లాడుతూ, దీపావళి నిర్వహించుకోవడంతో ఎలాంటి పరిమితి విధించలేదు అని చెప్పారు. కాబట్టి లిఖితపూర్వం అనుమతి ఇవ్వడంలో అర్థం లేదు అని అన్నారు .అక్టోబర్ 18న విద్యార్థులు దీపావళి జరుపుకోవాలన్నది మాత్రమే మా ఆందోళన అని, అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం కారణంగా, అక్టోబర్ 18న వేదికను శుభ్రం చేయడం సాధ్యం కాదు అని అలీ చెప్పారు.
అంతకు ముందు, హోలీ సమయంలో కూడా ఇలాగే వివాదం ఏర్పడింది. మార్చి 09న క్యాంపస్ లోపల హోలీ మిలన్ నిర్వహించేందుకు యూనివర్సిటీ పరిపాలన అనుమతి ఇవ్వలేదు. దీంతో హిందువులపై వివక్ష చూపిస్తున్నారని అనేక మంది విద్యార్థులు, అఖిల భారతీయ కర్ణి సేన సభ్యులు వర్సిటీకి వ్యతిరేకంగా భారీ నిరసన నిర్వహించారు. ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీంతో, వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తలొగ్గి, యూనివర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా, భారీ భద్రత మధ్య హోలీ జరిగింది.
తాజావార్తలు
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!