Site icon NTV Telugu

Diwali: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ‘‘దీపావళి’’పై ఉద్రిక్తత..

Amu

Amu

Diwali: ‘‘హోలీ’’ వివాదం మరిచిపోక ముందే, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)లో మరో వివాదం చెలరేగింది. అక్టోబర్ 18న హిందూ విద్యార్థులు క్యాంపస్‌లో ‘‘దీపావళి’’ జరుపుకోవడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించడం వివాదాస్పదమైంది. అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నందున అక్టోబర్ 18 తర్వాత, ఒకటి రెండు రోజులకు వేడుకలు జరుపుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులను కోరింది. దీపావళి జరుపుకోవడంపై ఎలాంటి ఇబ్బంది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో హోలీకి ముందు యూనివర్సిటీలో గందరగోళం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ వారం ప్రారంభంలో మాస్ కమ్యూనికేషన్ విద్యార్థి అఖిల్ కౌషల్ అక్టోబర్ 18న NRSC క్లబ్‌లో దీపావళి వేడుకలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాశారు. అనుమతి ఇవ్వకుంటే విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ వద్ద దీపావళి జరుపుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. హోలీ సమయంలో తమకు అనుమతి ఇవ్వకుండా వర్సిటీ తప్పు చేసిందని, వారు మళ్లీ తెలివైన వారు అయితే మళ్లీ ఇదే తప్పును రిపీట్ చేయరని ఆయన అన్నారు. ఒక వేళ అనుమతి రాకుంటా యూనివర్సిటీ హిందూ విద్యార్థులు ఏఎంయూ ‘‘బాబ్-ఎ-సయ్యద్’’ గేట్ వద్ద వైభవంగా దీపావళి జరుపుకుంటారని అన్నారు.

Read Also: Earbuds: లావా దీపావళి ఆఫర్.. కేవలం రూ. 21 కే ఇయర్‌బడ్స్..

దీనిపై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వసీం అలీ మాట్లాడుతూ, దీపావళి నిర్వహించుకోవడంతో ఎలాంటి పరిమితి విధించలేదు అని చెప్పారు. కాబట్టి లిఖితపూర్వం అనుమతి ఇవ్వడంలో అర్థం లేదు అని అన్నారు .అక్టోబర్ 18న విద్యార్థులు దీపావళి జరుపుకోవాలన్నది మాత్రమే మా ఆందోళన అని, అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం కారణంగా, అక్టోబర్ 18న వేదికను శుభ్రం చేయడం సాధ్యం కాదు అని అలీ చెప్పారు.

అంతకు ముందు, హోలీ సమయంలో కూడా ఇలాగే వివాదం ఏర్పడింది. మార్చి 09న క్యాంపస్ లోపల హోలీ మిలన్ నిర్వహించేందుకు యూనివర్సిటీ పరిపాలన అనుమతి ఇవ్వలేదు. దీంతో హిందువులపై వివక్ష చూపిస్తున్నారని అనేక మంది విద్యార్థులు, అఖిల భారతీయ కర్ణి సేన సభ్యులు వర్సిటీకి వ్యతిరేకంగా భారీ నిరసన నిర్వహించారు. ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీంతో, వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తలొగ్గి, యూనివర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా, భారీ భద్రత మధ్య హోలీ జరిగింది.

Exit mobile version