Diwali: ‘‘హోలీ’’ వివాదం మరిచిపోక ముందే, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)లో మరో వివాదం చెలరేగింది. అక్టోబర్ 18న హిందూ విద్యార్థులు క్యాంపస్‌లో ‘‘దీపావళి’’ జరుపుకోవడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించడం వివాదాస్పదమైంది. అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నందున అక్టోబర్ 18 తర్వాత, ఒకటి రెండు రోజులకు వేడుకలు జరుపుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులను కోరింది. దీపావళి జరుపుకోవడంపై ఎలాంటి ఇబ్బంది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో హోలీకి ముందు యూనివర్సిటీలో…