Amruta: నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు.. విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్
- ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై విపక్షాలు విమర్శలు
- నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు
- విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దావోస్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌లో పర్యటిస్తున్నారు. అయితే ఫడ్నవిస్ పర్యటనను శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ దావోస్‌కు పిక్నిక్‌కి వెళ్లారంటూ విమర్శించారు. అంతేకాకుండా దావోస్‌ను సందర్శించిన ప్రభుత్వ పెద్దల ఖర్చులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులంతా దావోస్‌లో పిక్నిక్ మూడ్‌ను ఆస్వాదిస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Trump-Europeans: సుంకాలపై యూటర్న్.. యూరోపియన్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్
Also Read
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
తాజాగా సంజయ్ రౌత్ ఆరోపణలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత కౌంటర్ ఎటాక్ చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. తన భర్త దావోస్‌కు పిక్నిక్‌కు వెళ్లలేదని.. మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించడానికి.. అనేక మంది ఉపాధి కల్పించడానికి వెళ్లారని చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని అమృత పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మేయర్ పీఠం కోసం ఇంకా తర్జన భర్జన జరుగుతోంది. ప్రస్తుతం ఫడ్నవిస్ దావోస్ పర్యటనలో ఉండడంతో ఇంకా ఎటూ తేలలేదు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటింది. అన్ని చోట్ల ఘన విజయాలు సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: Tragedy: మరో బస్సు ప్రమాదం.. లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
తాజావార్తలు
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!