NTV Telugu Site icon

Amritpal Singh: పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులు.. జార్జియాలో శిక్షణ.. ఖలిస్తానీ నేత గురించి విస్తూపోయే విషయాలు

Amrit Singh

Amrit Singh

Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ గురించి ఒక్కో విషయం బయటపడుతోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర ఇందులో దాగున్నట్లు తెలుస్తోంది. ఇతనికి పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడికి సహాయకుడిగా ఉన్న ఢిల్లీ చెందిన దల్జీత్ కల్సికి పాక్ ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. కెనడాలోని వాంకోవర్ లో పాకిస్తాన్ కాన్సుల్ జనరల్ లో భారత్ కు వ్యతిరేకంగా మెమోరాండం సమర్పించినట్లు తేలింది. ఇంటెలిజెన్స్ వర్గాల ఇన్‌పుట్స్ ప్రకారం.. ఫిబ్రవరి 23, 2023 అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేయాలనే కుట్రలో కల్సికి భాగం ఉంది.

Read Also: SL vs NZ : రెండో టెస్టులో తేలిపోయిన లంక.. క్లీన్ స్వీప్ చేసిన కివీస్

అమృత్ పాల్ సింగ్ 2012లో ట్రక్ డ్రైవర్ గా పనిచేసేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఖలిస్తాన్ నేత లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు జస్వంత్, ఉగ్రవాది పరంజీత్ సింగ్ పమ్మాతో పరిచేయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరంతా కలిసి అమృత్ పాల్ సింగ్ కు దుబాయ్ లోనే బ్రెయిన్ వాష్ చేశారు. ఆ తరువాత జార్జియా వెళ్లిన అమృత్ పాల్ సింగ్ కు పాక్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు దీప్ సిద్దూ మరణం అనంతరం ఆ సంస్థను హస్తగతం చేసుకుని కీలక వ్యక్తిగా ఎదిగారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా వీరికి ఆయుధాలు సమకూరేవని తెలుస్తోంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్ ను అలర్ట్ చేసింది. తప్పించుకున్న అమృత్ పాల్ సింగ్ నేపాల్ మీదుగా కెనడా వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన భార్య కిరణ్ దీప్ కౌర్ యూకేకు చెందిన ఎన్నారై. ఆమె ఇప్పటికే కెనడా వీసా కోసం దరఖాస్తు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.

Show comments